Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఆడిన అతిపెద్ద అబద్దం ఇదే
By: Tupaki Desk | 3 Jan 2019 5:10 PM GMTగత కొద్దికాలంగా హాట్ హాట్ కామెంట్లతో తెరమీదకు వస్తున్న మాజీ ఎంపీ సబ్బం హరి మరోమారు హాట్ కామెంట్లు చేశారు. ఏపీలో మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే అభివృద్ధి కొనసాగుతుందని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారని సబ్బం హరి తెలిపారు. చంద్రబాబు స్థానంలో మరొకరు సీఎం అయితే - అభివృద్ధి తిరోగమిస్తుందని భావిస్తున్నారని ఆయన విశ్లేషించారు. చంద్రబాబును అడ్డుకునేందుకు ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ఫలించబోవని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు విజయాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని అన్నారు. జగన్ సీఎం కావాలని కొందరు - పవన్ ముఖ్యమంత్రి కావాలని మరికొందరు కోరుకుంటున్నారని...అయితే ఎంత శాతం మంది కోరుకుంటున్నారనే విషయం ఎన్నికల్లో తెలుస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావాలని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదని సబ్బం హరి తెలిపారు.
ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సబ్బం హరి నిప్పులు చెరిగారు. విశాఖపట్నంకు వెళ్లినప్పుడు వేల మంది - లక్షల మంది డాబాలపై నిల్చుని తనకు స్వాగతం పలికారని...చంద్రబాబును ఓడించి మంచి పని చేశారని తనతో చెప్పారని కేసీఆర్ ఇటీవల చెప్పుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ఏం చేశారో - ఎన్ని అబద్దాలు చెబుతున్నారో తనకు అవసరం లేదని...కానీ ఏపీలో ఆయన వ్యవహరించిన తీరు సరికాదన్నారు. విశాఖలో తన కోసం వేల మంది వచ్చారని కేసీఆర్ చెప్పుకోవడం కంటే పెద్ద అబద్ధం లేదని అన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెబుతారనేదానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.