Begin typing your search above and press return to search.
బీజేపీకి తిరుపతి సీటు.. పవన్ నిర్ణయం భేష్ అంటున్న సీనియర్ నేత
By: Tupaki Desk | 28 March 2021 8:30 AM GMTప్రస్తుతం ఏపీలో జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన పంచాయితీ.. పుర ఎన్నికల్లో తన సత్తా చాటిన ఏపీ అధికారపక్షానికి పెద్ద సవాలు ఎదురుకాని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ తరఫున మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ బరిలో నిలిస్తే.. బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్ అధికారిన రత్నప్రభ నిలిపిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో జనసేన తన అభ్యర్థిని నిలుపుతుందని భావించినా.. బీజేపీ ఒత్తిడితో జనసేనాని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
దీంతో.. జనసేన వర్గీయులు కూసింత నిరాశకు గురయ్యారు. అయితే.. పవన్ తీసుకున్న నిర్ణయం మంచిదని పొగిడారు మాజీ ఎంపీ కమ్ సీనియర్ నేత సబ్బం హరి. తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకుండా పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. బీజేపీకి మద్దతు తెలిపితే.. దాని బలమేమిటో దానికి తెలిసి వస్తుందన్న ఆయన.. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం అస్సలు లేదన్నారు.
పోటీ మొత్తం వైసీపీ.. టీడీపీ మధ్యనే ఉంటుందని ఆయన అంచనా వేశారు. అధికార పార్టీ అండదండలతో బీజేపీ గెలుస్తుందన్నఅంచనా తప్పని.. అలాంటి అవకాశమే బీజేపీకి లేదన్నారు. బీజేపీతో కలిసి ఉండటం కారణంగా పవన్ గట్టిగా మాట్లాడలేకపోతున్నారన్నారు. బీజేపీతో మిత్రత్వం ఉన్న కారణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్.. పెరిగిన పెట్రో ధరల మీద పవన్ కల్యాణ్ మాట్లాడలేకపోతున్నారని.. గట్టిగా నిలదీయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు.
ప్రజలకు సంబంధించిన అంశాలపై చాలా వేగంగా స్పందించే పవన్.. మిత్రుడు బీజేపీ కారణంగా మౌనంగా ఉంటున్నారని.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పవన్ ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందన్నారు. అయితే.. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి జనసేన శ్రేణులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారన్న నమ్మకం తనకు లేదన్న సబ్బంమాటలు ఆసక్తికరంగా మారాయి.