Begin typing your search above and press return to search.
కేసీఆర్ కుటుంబంపై వైఎస్ చెల్లెలి కోపం
By: Tupaki Desk | 5 Dec 2016 10:07 AM GMTవైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్న కాలంలో అప్పటి హోం మినిష్టర్ సబితా ఇంద్రారెడ్డిని సొంత చెల్లెలిలా చూసుకునేవారు. సబిత కూడా వైఎస్ పై ఎవరైనా విమర్శలు చేస్తే చాలా సీరియస్ గా తీసుకుంటారు, గట్టి సమాధానం ఇస్తారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్ పథకాలు - పాలనపై విమర్శలు చేయడంతో తాజాగా సబిత అందుకు కౌంటర్ వేశారు. కేసీఆర్ పాలన ఘోరంగా ఉందంటూ వైఎస్ ను విమర్శించే స్థాయి కేసీఆర్ కుటుంబానికి లేదని అన్నారు.
వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ - ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు వేస్ట్ అంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ - ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు ప్రభుత్వానికి గుడిబండగా మారాయని విమర్శించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తప్పుపట్టారు. లక్షల మందికి ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీని విమర్శించడం బట్టే కేసీఆర్ కుటుంబసభ్యుల ఆలోచన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రజలపై ఎంతో ప్రభావం చూపిందన్నారు. వైఎస్ ముద్రను తుడిచివేసేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కు డబ్బులు లేవంటూనే కూతురు కవిత బతుకమ్మ ఆడేందుకు మాత్రం కోట్లు విడుదల చేస్తున్నారని ఆమె విమర్శించారు. పేదలకు ఇళ్లకు కట్టించేందుకు డబ్బులు లేవంటూనే… కేసీఆర్ మాత్రం 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారని సబితా విమర్శించారు. హైదరాబాద్ లో రోడ్ల గతి చూస్తే చాలు కేటీఆర్ పనితీరు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఇలా ప్రతి అంశాన్ని పట్టిపట్టి కేసీఆర్ - కేటీఆర్ లను తూర్పారబట్టారామె.
తనను కూడా టీఆరెస్ లోకి రావాలని పిలిచారని.. అయితే తాను అందుకు ఒప్పుకోలేదన్నారు. జగన్ పై కేసుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా అన్నది అందరికీ తెలుసన్నారు. తాము ఎక్కడా నిబంధనలకు విరుద్దంగాపనిచేయలేదన్నారు. తాము ఎక్కడ తప్పు చేశామో సీబీఐ నిరూపించాల్సి ఉంటుందన్నారు. మహిళను మంత్రిగా చేస్తే తన కూతురు కవిత ప్రాధాన్యత తగ్గుతుందన్న భావన తోనే కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు స్థానమివ్వలేదన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/