Begin typing your search above and press return to search.
రేవంత్ మంత్రాంగం.. సబిత పీచేముడ్
By: Tupaki Desk | 12 March 2019 5:18 AM GMTకేసీఆర్ భారీ స్కెచ్ ను రేవంత్ రెడ్డి భగ్నం చేశారు. కాంగ్రెస్ కు పెద్ద జలక్ ఇద్దామని యోచించిన కేసీఆర్ పన్నాగాన్ని రేవంత్ తుత్తునియలు చేశారు. నిన్న రాత్రి నాటకీయ పరిణామాల మధ్య రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డితో చర్చలు జరిపారని విశ్వసనీయ సమాచారం. అప్పుడే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఫోన్ లో మాట్లాడించినట్టు సమాచారం. దీంతో టీఆర్ ఎస్ లో చేరాలనుకున్న సబితా వెనక్కి తగ్గినట్టు సమాచారం. తాజాగా సబితా ఇంద్రారెడ్డి తన కొడుకు కార్తీక్ రెడ్డితో కలిసి ఢిల్లీ పయనమయ్యారు. అక్కడ రాహుల్ గాంధీని కలిసి కార్తీక్ రెడ్డికి ఎంపీ సీటు కోసం హామీ పొందుతారని తెలిసింది.
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇస్తానని అసెంబ్లీలో ప్రకటించిన దరిమిలా సబితా ఆశలు పెంచుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి ఒకటే సీటు అని సబితకు సీటు కు ఇచ్చి ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దీంతో కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంగా జరిగారు. సబిత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచింది.
ఈ సమయంలో కొడుకు భవిష్యత్ కోసం సబితా ఇంద్రారెడ్డి టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమాలోచనలు జరిపారు. కొడుకు కార్తీక్ కు చేవెళ్ల ఎంపీ సీటు.. తనకు మంత్రి పదవి ఇస్తే టీఆర్ ఎస్ లో చేరుతానని చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయి. దీనిపై అలెర్ట్ అయిన కాంగ్రెస్ పెద్దలు సబితను బుజ్జగించారు. నిన్న రాత్రి రేవంత్ ఏకంగా సబిత ఇంటికి వెళ్లి రాహుల్ తో మాట్లాడించి కార్తీక్ కు చేవెళ్ల ఎంపీ సీటు హామీని ఇప్పించినట్టు సమాచారం. దీంతో టీఆర్ఎస్ లో చేరుదామని ఆశించిన సబితా వెనక్కి తగ్గింది. ఇలా కేసీఆర్-కేటీఆర్ స్కెచ్ ను రేవంత్ రెడ్డి విచ్చిన్నం చేసి కాంగ్రెస్ ను కాపాడారని పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది.