Begin typing your search above and press return to search.

రాహుల్ ఫోన్ చేసినా ఫ‌లితం లేదు..సారుతో భేటీకి టైం ఫిక్స్!

By:  Tupaki Desk   |   12 March 2019 5:01 PM GMT
రాహుల్ ఫోన్ చేసినా ఫ‌లితం లేదు..సారుతో భేటీకి టైం ఫిక్స్!
X
కాంగ్రెస్ పార్టీ అధినేత నుంచి ఫోన్ కాల్ అంటే మాట‌లు కాదు. ఎంతో ప్రాధాన్య‌త ఉంటే త‌ప్పించి ఫోన్ కాల్ రాదు. కాల్ వ‌చ్చిందంటే పార్టీలో వారికి ఉండే గుర్తింపు అంతో ఇంతో ఉన్న‌ట్లే. ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రావ‌టాన్ని పార్టీ త‌మ‌కు ఇచ్చే గౌర‌వానికి నిద‌ర్శ‌నంగా కాంగ్రెస్ నేత‌లు భావిస్తుంటారు. అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. తెలంగాణలో ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.

పార్టీ అధినేత నేరుగా ఫోన్ చేసినా ప‌ట్టించుకోని ప‌రిస్థితి. చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌వేళ‌.. రేవంత్ ను రంగంలోకి దించిన అధినాయ‌క‌త్వం ఆమెను బుజ్జ‌గించాల‌ని కోరారు. దీంతో.. ఆమెకు ఫోన్ చేసిన రేవంత్ పార్టీ మారొద్దంటూ న‌చ్చ‌జెప్ప‌ట‌మే కాదు.. ఢిల్లీకి వెళ్లి అధినాయ‌క‌త్వంతో స‌మావేశం అయ్యేందుకు వీలుగా ప్ర‌య‌త్నాలు చేశారు.

దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు రావ‌టంతో టీఆర్ ఎస్ నేత‌లు అలెర్ట్ అయ్యారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో స‌బిత కానీ పార్టీ మార‌కుంటే అధికార‌ పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ జ‌ర‌గ‌టం ఖాయం. అందుకే కాబోలు చ‌ర్చ‌ల ప‌ర్వాన్ని ఒక కొలిక్కి తీసుకురావ‌ట‌మేకాదు.. యుద్ధ ప్రాతిప‌దిక‌న స‌బిత‌మ్మ‌ను గులాబీ కారులో ఎక్కించేందుకు రంగం సిద్ధం చేశారు. రేపు (బుధ‌వారం) ఉద‌యం టీఆర్ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో స‌బిత గులాబీ కుండువా క‌ప్పుకోనున్నారు.

ఆదివారం మ‌జ్లిస్ అధినేత అస‌ద్ నివాసంలో స‌బిత‌.. కేటీఆర్ భేటీ కావ‌టం.. వారి మ‌ధ్య చ‌ర్చ జ‌ర‌గ‌టం.. ఆ విష‌యాలు మీడియాలో వ‌చ్చాయి. దీంతో కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు అలెర్ట్ అయి స‌బిత‌ను ఆపే ప్ర‌య‌త్నం చేశారు. అయిన‌ప్ప‌టికి ఆమె పార్టీ మారే ఆలోచ‌న‌ను విర‌మించుకోలేదు. ఢిల్లీ నుంచి పార్టీ అధినేత రాహుల్ ఫోన్ చేసి మాట్లాడిన వేళ‌లో కాస్త స‌మాధాన ప‌డిన‌ట్లు క‌నిపించినా.. గులాబీ ముఖ్య‌నేత‌ల నుంచి వ‌చ్చిన స‌మాచారంతో ఆమె పార్టీ మారే విష‌యంలో తాను వెన‌క్కి త‌గ్గ‌లేద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు చెబుతున్నారు. మారుతున్న ప‌రిణామాల్ని గుర్తించిన టీఆర్ఎస్ నాయ‌క‌త్వం.. స‌బిత‌ను గులాబీ కారులో ఎక్కే ముహుర్తాన్ని బుధ‌వారానికి ఫిక్స్ చేశారు. దీంతో.. స‌బిత‌మ్మ పార్టీ మార‌టం ఖాయ‌మ‌ని తేలిన‌ట్లే.