Begin typing your search above and press return to search.
జంపింగ్ ఎమ్మెల్యేకు షాకిచ్చేలా మాజీ హోంమంత్రి స్కెచ్
By: Tupaki Desk | 21 Aug 2018 7:02 AM GMTఇటీవలి కాలంలో తెలంగాణలో ఒకింత బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ 2019కి కార్యాచరణ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ పార్టీల నేతలను తమ గూటికి చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దూకుడుగానే వ్యవహరిస్తోంది. అయితే ఇలా సమష్టి కార్యాచరణతో పాటుగా హస్తం పార్టీ నేతలు సొంతంగా తమ ప్రయోజనం కూడా చూసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ పరంగా రాబోయే ఎన్నికల్లో తమ వారసులను దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో `మాజీ హోంమంత్రుల`కుటుంబం తమ రాజకీయ వారసుడి ప్రణాళిక మార్పుతో అధికార పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ ఇద్దరు మాజీ హోంమంత్రులే ఇంద్రారెడ్డి - సబితారెడ్డి. ఆ కుటుంబం కన్నేసిన నియోజకవర్గం రాజేంద్రనగర్.
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేల్లో ఒకరిగా ఉండి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పటోళ్ల ఇంద్రారెడ్డి కన్నుమూసిన అనంతరం ఆయన భార్య సబితా సబితా ఇంద్రారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల చెల్లమ్మగా పేరొందిన సబితారెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి సైతం చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. మరో దఫా ఆయన టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఈ దఫా పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాకుండా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచే యోచనలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖరీదైన నియోజకవర్గాల్లో ఒకటైన రాజేంద్రనగర్ నుంచి ఆయన అరంగేట్రం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
ఇటీవల జరిగిన తన సోదరుడి వివాహం సందర్భంగా కార్తీక్ రెడ్డి స్వయంగా నియోజకవర్గంలోని తమ కుటుంబ సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి రాజేంద్రనగర్ వేరుపడింది. దీంతో పాత పరిచయాలను గుర్తుచేసుకొని తన సోదరుడి వివాహం సందర్భంగా కార్తీక్ వారికి చేరువ అయ్యారు. అదే సమయంలో ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమమైన శంషాబాద్ లో డ్వాక్రా మహిళలతో సమావేశంను సర్వం తానై నడిపించారు.
ఓవైపు ఇలా కార్తీక్ రెడ్డి కార్యక్రమాలను చేస్తుండగా తనయుడి కోసం మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దల వద్ద తన కుమారుడి పలుకుబడి పెంచేలా ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్. అయితే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ - పార్టీ నేతలు సామ రాజ్ పాల్ రెడ్డి - సానం శ్రీనివాస్ గౌడ్ వంటివారి కంటే దూకుడు పెంచేలా ఇటీవల పలు అంతర్గత సమావేశాలను, వివిధ కార్యక్రమాలను సైతం కార్తీక్ నిర్వహించినట్లు సమాచారం. మొత్తంగా జంపింగ్ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చేలా మాజీ హోంమంత్రి కుటుంబం వారసత్వ రాజకీయం నెరుపుతోందని టాక్ వినిపిస్తోంది.