Begin typing your search above and press return to search.
చేతికొచ్చిన 7వేల కోట్లను అలాంటి బిజినెస్ లో పెడుతున్నాడట!
By: Tupaki Desk | 1 May 2019 1:30 AM GMTఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయటం ఒక ఎత్తు అయితే.. దాన్ని సక్సెస్ ఫుల్ గా రన్ చేయటం మరో ఎత్తు. అన్నింటికి మించి ఒక వ్యాపారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలో తెలిసినా.. దాన్ని లాభసాటి డీల్ గా మార్చి.. వేరే వారి చేతికి అప్పజెప్పే టాలెంట్ చాలా తక్కువమందిలో ఉంటుంది. అలాంటి వాటి విషయంలో ప్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.
తాను స్టార్ట్ చేసిన ప్లిప్ కార్ట్ ను.. మంచి బేరం వచ్చినంతనే ఇచ్చేసిన వైనం హాట్ టాపిక్ గా మారినా.. అందుకుగాను అతగాడి చేతికి వచ్చిన మొత్తం విలువ ఏకంగా బిలియన్ డాలర్లు కావటం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫ్లిప్ కార్ట్ ను వాల్ మార్ట్ కు అమ్మేసిన ఎపిసోడ్ లో దాదాపుగా రూ.7వేల కోట్లు (కాస్త అటూఇటుగా) వచ్చాయి. మరింత భారీ మొత్తం చేతిలోకి వచ్చిన బన్సల్ ఏం చేస్తున్నారు? వేటిల్లో పెట్టుబడులు పెడుతున్నారన్నది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
తన చేతికి వచ్చిన మొత్తాన్ని.. కొత్త కొత్త స్టార్టప్ లలో పెట్టుబడులు పెడుతున్నారు బన్సల్. తాజాగా ఆన్ లైన్ కిరాణ.. పాల సరఫరా సంస్థ మిల్క్ బాస్కెట్లో పెట్టుబడులు పెట్టారు. దాదాపుగా రూ.20కోట్ల మొత్తాన్ని ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన ఆయన.. పలు స్టార్ట ప్ లలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకే క్లిక్ తో కొనుగోళ్లు పూర్తి అయ్యేలా రూపొందించిన మిల్క్ బాస్క్ ట్ యాప్ ను 2015లో స్టార్ట్ చేశారు. గురుగ్రామ్.. నోయిడా.. ఘజియాబాద్.. బెంగళూరుల్లో ఈ యాప్ నకు ఆదరణ లభిస్తోంది. రుణ మార్కెట్లో ఉన్న అవకాశాల్ని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే వందల కోట్లతో ఫండ్స్ ను ఏర్పాటు చేసిన ఆయన.. ఇందుకోసం బీఏసీ అక్విజేషన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. చేతిలో డబ్బులు.. దేన్లో పెట్టుబడులు పెడితే లాభాలు బాగా వస్తాయన్న విషయం మీద క్లారిటీ ఉన్న బన్సల్ లాంటోళ్ల పుణ్యమా అని.. కొత్త టాలెంట్ బయటకొచ్చే అవకాశం ఉందని చెప్పక తప్పదు.