Begin typing your search above and press return to search.
కండ్రిగ దశ మార్చేసిన క్రికెట్ దేవుడు
By: Tupaki Desk | 2 Oct 2015 6:17 AM GMTక్రికెట్ దేవుడిగా అభివర్ణించే మాస్టర్ బ్లాస్టర్.. భారతరత్న సచిన్ టెండూల్కర్ పుణ్యమా అని ఒక చిన్న ఊరు పరిస్థితి మొత్తంగా మారిపోయింది. నిన్నమొన్నటి వరకూ అనామకంగా పడిన ఆ ఊరు ఇప్పుడు పలు సెమినార్లలో చర్చనీయాంశంగా మారటం గమనార్హం. అంతేకాదు.. ఆ ఊర్లో జరిగిన అభివృద్ధి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకోవటానికి ముందు ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మారుమూల గ్రామం (పుట్టంరాజు కండ్రిగ) రూపురేఖలు మొత్తంగా మారిపోయాయి. ఇప్పుడు గ్రామంలో సిమెంటు రోడ్ల నిర్మాణం జరగటంతో పాటు.. ఫుట్ పాత్ లు.. డ్రైనేజీ నిర్మాణం పూర్తి అయ్యింది. గతంలో కరెంటు లేని ఈ గ్రామానికి ఇప్పుడు 24 గంటలూ విద్యుత్తు ఇస్తున్నారు. అంతేకాదు.. అంగన్ వాడీ కేంద్ర నిర్మాణం కూడా జరిగిపోయింది.
గ్రామానికి ప్రభుత్వ పాఠశాల రావటంతోపాటు.. పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ గ్రామం రూపు రేఖలు ఎంతలా మారిపోయాయంటే.. భోపాల్ లో జరిగిన ఒక సెమినార్ లో ఈ గ్రామానికి సంబంధించిన ఆరు నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించారు. క్రికెట్ దేవుడు దత్తత తీసుకున్న గ్రామం అంటే మాటలు కాదు కదా. క్రికెట్ గ్రౌండ్ లోనే కాదు.. దత్తత తీసుకున్న గ్రామంలోనే క్రికెట్ దేవుడు తన మేజిక్ ప్రదర్శించారు.