Begin typing your search above and press return to search.
సచిన్ కూతురికి బెదిరింపులు...అరెస్టు!
By: Tupaki Desk | 7 Jan 2018 12:41 PM GMTప్రస్తుతం సమాజంలో మహిళలు చాలా చోట్ల వేధింపులకు గురవుతోన్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అతివలందరూ ఏదో ఓ రకంగా వేధింపుల బాధితులే. పనీపాట లేని పోకిరీల నుంచి ఆఫీసుల్లో గుంటనక్కల్లా కాచుకున్నవ్యక్తుల వరకు చాలామంది....మహిళలను వేధించి పైశాచికానందం పొందాలని చూసేవారే. తాజాగా, ఈ వేధింపుల సెగ లెజెండరీ బ్యాట్స్ మన్ - క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ కు కూడా ఎదురయ్యాయి. సారాను పెళ్లి చేసుకుంటానని....లేకుంటే ఆమెను కిడ్నాప్ చేస్తానని ఓ వ్యక్తి.....సచిన్ ఇంటికి పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. విసిగి వేసారిన సారా..... ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో, ఆ వ్యక్తిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ కు చెందిన దేవ్ కుమార్(32)....సచిన్ ల్యాండ్ నంబర్ ను సంపాదించాడు. ఆ నంబర్ కు దాదాపు 20 సార్లు ఫోన్ చేసి సారాను పెళ్లి చేసుకుంటానని, లేకుంటే కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. దీంతో, సచిన్ కుమార్తె ...స్థానిక పోలీసులకు ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2న దేవ్....ఫోన్ చేశాడని, డిసెంబర్ 5న బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అతడు డయల్ చేసిన టెలిఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా గాలించి పట్టుకున్నారు. అయితే, దేవ్ మానసికస్థితి సరిగా లేదని , అందుకే ఇలా చేశాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దేవ్ ను ముంబైకి తీసుకొచ్చి - కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, సచిన్ ఫోన్ నంబర్ అతడికి ఏవిధంగా చేరిందో అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ అతడి మానసిక పరిస్థితి వాస్తవంగానే బాగా లేదా....లేకుంటే కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ విధంగా ప్రవర్తించాడా అన్న విషయంపౌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.