Begin typing your search above and press return to search.

కరోనాను టెస్ట్ క్రికెట్ తో పోల్చిన క్రికెట్ దేవుడు

By:  Tupaki Desk   |   21 March 2020 3:33 PM GMT
కరోనాను టెస్ట్ క్రికెట్ తో పోల్చిన క్రికెట్ దేవుడు
X
క్రికెట్ కు దేవుడిగా పేరు పొందిన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కరోనా వైరస్ మహమ్మారిపై స్పందించారు. తనదైన క్రికెట్ స్టైల్ లో కరోనా వైరస్ పై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటం టెస్టు క్రికెట్‌ లాంటిది సచిన్‌ టెండూల్కర్ పేర్కొన్నారు. కరోనాపై పోరులో ప్రజలందరికీ సహనం, సమష్టితత్వం, అప్రమత్తత అవసరమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ట్వీటర్ లో ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ పై ఆయన మాటల్లోనే..

‘ప్రపంచమంతా కరోనా పై పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా క్రికెట్‌లో సాంప్రదాయ ఫార్మాట్‌ అయిన టెస్టు క్రికెట్‌ను మనం గుర్తు తెచ్చుకోవాలి. టెస్టు క్రికెట్‌ ఎన్నో విషయాలను మనకు బోధిస్తుంది. ప్రధానంగా సహనానికి ఉన్న విలువను చూపెడుతోంది. పిచ్‌ పరిస్థితులను, బౌలర్‌ శైలిని మనం అర్థం చేసుకుని సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేయాలి. ఇక్కడ అత్యంత రక్షణాత్మకంగా ఆడటం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత ప్రపంచానికి కావాల్సిందే ఓర్పు. కరోనాపై మనల్ని రక్షించుకోవాలంటే ఎంతో ఓపిక అవసరం’ అని సచిన్‌ తన క్రికెట్ భాషలో తెలిపాడు.

ఈ సందర్భంగా జనతా కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని సచిన్ టెండూల్కర్ కోరారు. అత్యవసరమైతే తప్పితే అంతా కూడా స్వీయ నిర్భందాన్ని పాటించాలన్నారు. కరోనా వైరస్‌ నిరోధానికి ఇది కూడా ఎంతో ముఖ్యమైనదని చెబుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన జనతా కర్ఫ్యూను అందరం పాటిద్దామని పిలుపునిచ్చాడు. వైరస్‌ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా సూచించారు. మార్చి 22 ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటలకు ఎవరూ బయటకు రావొద్దని విన్నవించారు.