Begin typing your search above and press return to search.
జగన్ లా సచిన్ సక్సెస్ ఫుల్ `పొలిటికల్` పైలట్ అవుతారా?
By: Tupaki Desk | 17 July 2020 2:30 AM GMTప్రస్తుతం రాజస్థాన్ రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేయడం సంచలనం రేపింది. రాష్ట్రానికి పైలట్ వంటి సీఎం గెహ్లాట్ పై కో పైలట్ వంటి సచిన్ పైలట్ రెబల్ బెల్స్ మోగించడం కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చలేదు. దీంతో, సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి, పీసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాదు, సచిన్ పైలట్‌తో పాటు అతడికి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆల్రెడీ సచిన్ పైలట్ స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పైలట్ ఏం చేయబోతున్నారు?
ఇటు, కాంగ్రెస్‌ను అటు బీజేపీని కాదని సచిన్ పైలట్ రాజస్థాన్ రాజకీయాల్లో ఏ విధంగా చక్రం తిప్పాలనుకుంటున్నారు? గతంలో కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టి రాణించిన అతి కొద్ది మంది నేతల్లా ఇప్పటికిప్పుడు సొంతగా పార్టీ పెట్టి సచిన్ రాణించగలరా? ఇటువంటి అనేక ప్రశ్నలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అప్పటివరకు ఉన్న పార్టీతో తెగదెంపులు చేసుకొని...సొంతగా పార్టీ పెట్టి రాణించిన నేతలు చాలా తక్కువ. గతంలో ఘన్‌శ్యాం తివారీ, కిరోరీలాల్ మీనా, దేవీ సింగ్ భాటి, లోకేంద్ర సింగ్ కల్వి, లేదా హనుమాన్ బేనీవాల్.. వీరంతా అప్పటివరకు నమ్మకున్న పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు. అయితే, వీరెవ్వరూ విజయం సాధించి తమ సత్తా చాటుకోలేకపోయారు.
సీఎం వసుంధరరాజేతో విబేధించి భారత్ వాహిని పార్టీ స్థాపించిన తివారీకి ఆరుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. కానీ, కొత్త పార్టీ పెట్టిన తివారి ఓటమి చవిచూశారు. ఇలా దేశంలో చాలామంది నేతలు సొంతపార్టీ పెట్టి విఫల ప్రయోగాలు చేశారు. అయితే, వారిలో చాలామంది వృద్ధ నేతలు లేదా సీనియర్ నేతలు. ఏపీ సీఎం జగన్ తరహాలో సొంతపార్టీ పెట్టి...గ్రాంగ్ సక్సెస్ అయిన నేతలూ కొద్ది మంది ఉన్నారు. అయితే, యువనేత సచిన్ పైలట్ విషయంలో ....ఒకవేళ సొంతపార్టీ పెడితే ఏం జరగవచ్చన్న చర్చ మొదలైంది. సొంత పార్టీ పెడితే ప్రజలు సచిన్ పైలట్‌ను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంలోనే కాంగ్రెస్ తో విభేదించి...సోనియాను ఎదిరించి...సొంతపార్టీ పెట్టిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఉదంతం దేశ రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. జగన్ తరహాలోనే సచిన్ ...సొంతగా పార్టీపెట్టి...అష్టకష్టాలను ఓర్చి....అఖండ విజయం సాధించగలరా అన్న చర్చ జరుగుతోంది. సీఎం జగన్ పార్టీ పెట్టిన కొత్తలో నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్....రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ లోని చాలామంది సీనియర్ నేతలు జగన్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ప్రతిపక్ష పాత్రలో ఐదేళ్ల పాటు జగన్ వెంట నడిచిన నేతలూ చాలామందిని టీడీపీ ప్రభుత్వం నానారకాలుగా వేధించింది. అయితే, వీటన్నింటినీ ఎదుర్కొన్న జగన్ మరింత బలంగా తయారయ్యారు.
ముళ్లబాటలో నడిచి మరీ అఖండ మెజారిటీతో కనీవినీ ఎరుగని రీతిలో విజయ దుందుభి మోగించారు. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన తొలి విడత ఎన్నికల్లో తృటిలో విజయం చేజార్చుకున్న జగన్....మలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయం సాధించి సీఎం అయ్యారు. అయితే, జగన్ అంత మొండితనం, ధైర్యం, తెగువ, ఇబ్బందులను ఎదుర్కొనే సత్తా...సచిన్ కు ఉందా అన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లోని సీనియర్ సిటిజెన్లను తట్టుకొని సచిన్ నిలబడగలడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దివంగత నేత వైఎస్సార్ లాగా సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ కూ మాస్ లీడర్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, జగన్ లా వేరు కుంపటి పెట్టి....ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కుట్రలను ఛేదించుకొని సచిన్ నెగ్గుకు రాగలడా అన్న చర్చ జరుగుతోంది.
జగన్ లా ఇబ్బందికర పరిస్థితులకు తలొగ్గకుండా....ఎత్తిన తల దించకుండా....దీటుగా వైరి నేతలతో పోరాడగలడా అన్నది తేలాల్సి ఉంది. వైసీపీని రాజకీయ గగనతలంలో ఎవరికీ అందనంత ఎత్తుకు తీసుకువెళ్లిన పైలట్ జగన్ తరహాలో సచిన్ కూడా సక్సెస్ ఫుల్ `పొలిటికల్` పైలట్ అవుతారా? అన్న చర్చ జరుగుతోంది. సచిన్ పైలట్ తన రాజకీయ భవిష్యత్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.