Begin typing your search above and press return to search.
యోధుడిని కాబట్టే నన్ను అక్కడి కూర్చోబెట్టారు : సచిన్ పైలెట్
By: Tupaki Desk | 14 Aug 2020 1:30 PM GMTరాజస్థాన్ రాజకీయం ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఒకరి పై ఒకరు ఆగ్రహంగా ఉన్న సీఎం గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ ఇద్దరు కూడా కలిసిపోయారు. రాజకీయ సంక్షోభానికి తెర పడినట్టే అని భావించారు. కానీ , సీఎం గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ ఇద్దరు కలిసి చేతులు కలుపుకొని ఫొటోలకి పోజులిచ్చినా కూడా మనసులు మాత్రం ఇంకా పూర్తిగా కలిసినట్టు అనిపించడం లేదు. దీనికి గెహ్లోత్ ఇస్తున్న సంకేతాలే కారణం. గురువారం సీఎల్పీ భేటీ సందర్భంగా వీరిద్దరి ముఖాముఖీ జరిగింది. ఇద్దరు నవ్వుతూ.. షేక్‌హ్యాండిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. జరిగిందంతా మరిచిపోండి. రాజస్థాన్ ప్రజల కోసం... ప్రజాస్వామ్యం కోసం పనిచేద్దాం అంటూనే సీఎం గెహ్లోత్ చురకలంటించారు.
అలాగే, అసెంబ్లీలో కూడా సచిన్ పైలట్‌కు అధికార పక్షానికి దూరంగా... ప్రతిపక్షాలకు దగ్గరగా సీటు కేటాయించారు. ఈ నేపథ్యంలో తనకు కేటాయించిన సీటు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి గహ్లోత్‌కు దూరంగా విపక్షాలకు దగ్గరగా పైలట్ కు సీటు కేటాయించడం పై పెద్ద చర్చ జరిగింది. అయితే తనకు ప్రతిపక్షాలకు సమీపంలో సీటు కేటాయించడంపై పైలట్ తనదైన శైలిలో స్పందించారు. తనకు బోర్డర్ లో సీటు కేటాయించడం, విపక్షాల పక్కనే తాను కూర్చుండటం అందరిలో ఆసక్తి రేపుతోందని, సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన సైనికుడినే మోహరిస్తారు కాబట్టే తనకు అక్కడ సీటు కేటాయించారని , నేనే నిజమైన యోధున్ని కాబట్టే నన్ను బోర్డర్ కి పంపారు అని పైలట్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా రాజస్థాన్ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే .. సీఎం అశోక్ గెహ్లోత్ , పైలెట్ మధ్య సయోధ్య కుదిరింది అంటే కుదిరింది అని , పూర్తిగా సయోధ్య కుదరలేదని రాజస్థాన్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.