Begin typing your search above and press return to search.
ఉమ్మి నిషేధిస్తే కష్టమే: బీసీసీఐ రూల్స్ పై సచిన్ అసహనం
By: Tupaki Desk | 14 Jun 2020 3:30 PM GMTవైరస్ వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్ ఆటలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో నియమనిబంధనలు తీవ్రంగా ఉన్నాయి. బంతి మెరుపు కోసం, రివర్స్ స్వింగ్ కోసం బౌలర్లు ఉమ్మి వాడరాదని, దానికి బదులు చెమట వాడవచ్చని ఐసీసీ సూచించింది. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తొలి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన అసహనం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో బౌలర్లకు బదులు బౌలింగ్ మెషీన్స్ తెస్తారెమోనని తన స్నేహితులు తనతో ఎద్దేవా చేశారని తెలిపారు. ఇండియా టుడే క్రికెట్ సలాం కార్యక్రమంలో శనివారం (జూన్ 13) పాల్గొన్న సచిన్ క్రికెట్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. ఉమ్మి నిషేధించిన క్రమంలో బౌలర్లకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని సచిన్ సూచించాడు.
ఇంకొన్ని రోజులు పోతే బౌలర్ల ప్లేస్ లో రెండు ఎండ్స్‌లో బౌలింగ్ మెషీన్స్ చూస్తాం అనుకుంటానని పేర్కొన్నారు. వాటితో బ్యాట్స్ మన్ కు కావాల్సినట్టు బాల్స్ వేయవచ్చని క్రికెట్ తన ఫ్రెండ్స్ చెప్పారని వివరించారు. సలైవా వాడడాన్ని ఐసీసీ బ్యాన్ చేసింది సరే మిడిల్ ఓవర్స్‌లో ఓ బౌలర్ బాల్ ను ఎలా స్వింగ్ చేస్తాడని ప్రశ్నించారు. చెమట వాడమని చెప్పారు కానీ వాతావరణ పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో ప్లేయర్లకు చెమట పట్టదని.. అలాంటప్పుడు బాల్‌ను ఎలా షైన్ చేస్తారని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల కోసమైనా ఓ మైనం బాక్స్‌ను అంపైర్స్‌కు ఇవ్వాలని కోరారు. అది ఎంత ఇవ్వాలో, ఎలా వాడాలో అన్నింటిని ఐసీసీనే తేల్చాలని సచిన్ చెప్పారు.
అది కుదరకపోతే 45-50 ఓవర్ల తర్వాత బంతిని కచ్చితంగా మార్చాలని సచిన్ తెలిపారు. ఉమ్మి నిషేధం అనేది బౌలర్లకు వందశాతం ఎదురుదెబ్బేనని స్పష్టం చేశారు. బాల్ మార్పు విషయంలో ప్రత్యర్థి జట్టు అభిప్రాయానికి అనుగుణంగా వెళ్లాలని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో క్రీడాటోర్నీలకు, సాంస్కృతిక వేదికలకు 25 శాతం మందిని అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంపై సచిన్ స్వాగతించాడు. ఈ సమయంలో స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తే గొప్ప విషయం అని పేర్కొన్నారు. జన సమూహంతో కూడిన స్టేడియంలో మ్యాచ్ ఆడితే వచ్చే మజానే వేరని తెలిపారు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఆ కిక్కు మిస్ అవుతామని వివరించారు. గ్రౌండ్‌లో ఫ్యాన్స్ క్రియేట్ చేసే ఎనర్జీ ఏం చేసినా రాదని స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై సచిన్ స్పందిస్తూ.. ఈ ఈవెంట్‌ను నిర్వహించగలమో లేదో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించుకోవాలని చెప్పాన్డు. దీనిపై వెంటనే నిర్ణయానికి రావడం కూడా కొద్దిగా కష్టమేనని తెలిపారు. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్ - వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ద్వారా క్రికెట్ మళ్లీ మొదలవుతుండటం చాలా ఆనందాన్నిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.