Begin typing your search above and press return to search.

హీరోయిన్ల‌కు ధీటుగా స‌చిన్ వార‌సురాలిపై ట్రోలింగ్

By:  Tupaki Desk   |   30 July 2022 2:30 AM GMT
హీరోయిన్ల‌కు ధీటుగా స‌చిన్ వార‌సురాలిపై ట్రోలింగ్
X
సారా టెండూల్కర్ .. షో బిజ్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వార‌సురాలిగా త‌న‌కు ఆ రేంజు ఉంది. స‌చిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ - కుమార్తె సారా టెండూల్కర్ సహజంగానే ర‌క‌ర‌కాల‌ కారణాలతో చ‌ర్చ‌ల్లోకొస్తున్నారు. సారా త్వ‌ర‌లోనే బాలీవుడ్ క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేయ‌నుంద‌న్న క‌థ‌నాల న‌డుమ త‌న‌పై ప్ర‌జ‌ల ఫోక‌స్ కూడా ఎక్కువ‌గా ఉంది. తాజాగా ముంబై నగరంలో సారా ఓ కాంప్లెక్స్ లోకి వెళుతూ కనిపించింది. అందుకు సంబంధించిన ఓ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. దీనిపై ట్రోల‌ర్లు విరుచుకుప‌డ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక సారా కు సంబంధించిన‌ అందమైన వీడియోలు ఫోటోషూట్ లతో త‌న‌ ఇన్ స్టాగ్రామ్ ఇటీవ‌ల హీటెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

సారా టెండూల్కర్ తాజా ఫోటోగ్రాఫ్ లో బ్లాక్ ప్యాంటు వైట్ టాప్ ధరించింది. త‌న హెయిర్ ని సగానికి ముడివేసి మీడియాను చూడగానే చిరునవ్వుతో మురిపించింది. ఈ యంగ్ బ్యూటీ పేరు ఇటీవలి కాలంలో ఫిల్మీ క‌థ‌నాల్లో ఎక్కువ‌గా వినిపిస్తోంది.

అయితే సారా టెండూల్కర్ ను నెటిజన్లు క్రూరంగా ట్రోల్ చేస్తున్నారు. తాజా వీడియోకి ర‌క‌ర‌కాల కామెంట్లు సోష‌ల్ మీడియాల్లో క‌నిపిస్తున్నాయి. త‌న‌ను ఆంటీ అని ..స్టీమ్డ్ మోమో (కులు మ‌నాలిలో ఫుడ్ ఐటమ్) అని పిలుస్తున్నారు. కొందరు కామెంట్స్ లో త‌న రూమ‌ర్డ్ బాయ్ ఫ్రెండ్ శుభ్ మాన్ గిల్ గురించి పోస్ట్ చేస్తున్నారు. సారా ఒక `నేపాలీ` అమ్మాయిలాగా కనిపిస్తోందని కొందరు అన్నారు. త‌న‌ ఎత్తుపై నెటిజన్ ఒక‌రు ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ చూస్తుంటే ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత ఫాలోయింగ్ త‌న‌కు ఉంద‌ని కూడా అర్థ‌మ‌వుతోంది.

సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ అత్యంత అందమైన ప్రతిభావ‌నిగా యూత్ లో ఫేమ‌స్ అయ్యింది. సారా తండ్రి స‌చిన్ టెండూల్క‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్టార్ డమ్ క‌లిగిన క్రికెట‌ర్‌. దీనివ‌ల్ల సారా ఎప్పుడూ అభిమానుల‌ దృష్టిలో ఉండటం సహజం. ఇదే అంశం సారాను సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీని చేసింది. నెమ్మదిగా అయినా స్థిరంగా డిజిటల్ ఐకాన్ గా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది. సోష‌ల్ మీడియాల్లో సారాకు అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది.

చాలా కాలంగా సారా భ‌విష్య‌త్ లో ఏం అవుతుంది? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. త‌న అభిరుచి న‌ట‌నా రంగం వైపు ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సారా ఇటీవ‌ల మోడ‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. న‌టి బానిట సంధుతో క‌లిసి ఇటీవలే ఓ క్లాథింగ్ లైన్ కి ప్ర‌చారం చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేసింది. సారా ముగ్ధ మ‌నోహ‌ర రూపం కుర్ర‌కారు గుండెల్ని పిండేసిందంటే అతిశ‌యోక్తి కాదు. ఒక బాలీవుడ్ క‌థానాయిక అయ్యేందుకు అవ‌స‌ర‌మైన స‌రంజామా సారాలో పుష్క‌లంగా దాగి ఉంద‌న్న ప్ర‌శంస వినిపించింది. మొన్న‌టికి మొన్న ప్ర‌ముఖ బ్రాండ్ స‌మ్మ‌ర్ క‌లెక్ష‌న్స్ కి సారా ప్ర‌చారం చేస్తున్న వీడియో కూడా వైర‌ల్ అయ్యింది.

లండన్ కాలేజ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన సారా.. న‌ట‌నారంగంపైనా మ‌క్కువ పెంచుకుంద‌ని మోడ‌లింగ్ అంటే ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంద‌ని కూడా టాక్ ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇక మోడ‌ల్ అంటే క‌థానాయిక అయిన‌ట్టే. ఒకవేళ సారా బాలీవుడ్ లో అడుగుపెడితే త‌న కెరీర్ ని ముందుకు న‌డిపించేందుకు గాడ్ ఫాద‌ర్స్ కి కొద‌వేమీ ఉండ‌దు. స‌చిన్ కుమార్తెగా త‌న‌కు ప్ర‌మోష‌న్ చాలా ఈజీ. ఒక ప్ర‌ముఖ స్టార్ హీరో కుమార్తెకు ఉన్నంత నెపోటిజం బ‌జ్ కూడా క్రియేట్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

సారా త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఆరంగేట్రం చేయ‌బోతోందని పుకార్లు వచ్చాయి కానీ ఇప్పటివరకు స‌రైన క్లారిటీ ఏదీ లేదు. త‌ను న‌ట‌నా మార్గంలో ప్రయాణిస్తుందా అనేదానిపై ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు. త‌న‌ సోదరుడు సచిన్ చిన్న కుమారుడు అర్జున్ క్రికెట్ బాట పట్టాడు. అతను ఇప్పటికే ఐదుసార్లు ఐపిఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో గడిపాడు. ఫిబ్రవరి 2022లో జరిగిన IPL 2022 మెగా వేలంలో అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసారు. కానీ అర్జున్ ఇప్పటివరకు టీమ్ కోసం ఒక్క ఆట కూడా ఆడలేదు. అర్జున్ అంతకుముందు ముంబై తరపున వయస్సు ఆట‌గాళ్ల‌తో సమూహ క్రికెట్ లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. ఆట‌లో రాణిస్తున్నాడు. మునుముందు టీమిండియాకు ఆడేందుకు ఆస్కారం ఉంద‌ని భావిస్తున్నారు. సారా టెండూల్క‌ర్ త‌న సోద‌రుడి ఆట‌కు పెద్ద అభిమాని. సారా నగరంలోనే ఉంటే అతను ఆడుతున్న గేమ్ కు ఎల్లప్పుడూ హాజరవుతుంది.