Begin typing your search above and press return to search.
సచిన్ పరువు తీసేసిన తెలంగాణ ఎంపీ
By: Tupaki Desk | 22 Dec 2017 8:40 AM GMTఒక్కసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే...ఎంతటి వారైన పాలిటిక్స్ లోని ఎత్తులు - పై ఎత్తుల్లో భాగంగా కావాల్సిందే. తమ ప్రమేయం ఏమీ లేకపోయినప్పటికీ...సదరు కామెంట్లను అనుభవించాల్సిందే. అలాంటి చిత్రమైన పరిస్థితే తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కు ఎదురైంది.
రాజ్యసభలో తొలిసారి మాట్లాడేందుకు బుధవారం సచిన్ సిద్ధమవడం..కాంగ్రెస్ సభ్యుల ఆందోళన మధ్య మాస్టర్ బ్లాస్టర్ తన మొదటి ఇన్నింగ్స్ లో ఖాతాను తెరువలేకపోవడం అంతా తెలిసిన సంగతే. అయితే ఈ ఎపిసోడ్ పై తెలంగాణకు చెందిన మహిళా ఎంపీ భారీ సెటైర్ వేశారు? సచిన్ అయితే ఏంటి? భారతరత్న అయితే గొప్పేంటి అంటూ నిలదీశారు.
కాగా, గురువారం రాజ్యసభలో స్వల్పకాల చర్చపై ఇవాళ తొలిసారి రాజ్యసభలో సచిన్ మాట్లాడేందుకు సచిన్ ప్రిపేరయ్యారు. అయితే మరోవైపు అదే సమయంలో ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ విపక్ష సభ్యలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. క్రీడల అంశంపై మాట్లాడేందుకు సచిన్ సభలో లేచి నిలుచున్నారు. కానీ ఆందోళనలు మిన్నంటాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. భారీగా అరుపులు - కేకలు వినిపించారు. సభ గందరగోళంగా మారింది. అయినా సభ్యుల నినాదాలు సభలో హోరెత్తాయి. దాంతో చైర్మన్ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. నినాదాలు చేయవద్దు అంటూ విపక్ష సభ్యులను కోరారు. అయినా వాళ్లు వినిపించుకోలేదు. దీంతో సచిన్ టెండూల్కర్ క్రీడల అంశంపై మాట్లాడలేకపోయారు. తద్వారా తన అరంగేట్ర ప్రసంగంలో సచిన్ రాజ్యసభలో విఫలమయ్యారు.
మరోవైపు ఈ పరిణామంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహానికి గురయ్యారు. క్రీడల గురించి మాట్లాడుతుంటే వినరా అంటూ సభ్యులపై ఆవేశాన్ని వ్యక్తం చేశారు. యువ క్రీడాకారులు సచిన్ ను స్ఫూర్తిగా తీసుకుంటారని ఆయన అన్నారు. భారత రత్న అందుకున్న వ్యక్తి క్రీడల గురించి మాట్లాడుతుంటే ఆయన్ను అడ్డుకుంటారా అంటూ వెంకయ్య సీరియస్ అయ్యారు. అయితే నినాదాలు ఆగకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో సచిన్ టెండూల్కర్ కు కాంగ్రెస్ నిరసనల కారణంగా మాట్లాడే అవకాశం రాని నేపథ్యంలో దిగ్గజ ఆటగాడు - భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ నే మాట్లాడకుండా అడ్డుకుంటారా? అని బీజేపీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత - రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఒకింత ఘాటుగా స్పందించారు. భారత రత్న పురస్కారం పార్లమెంటులో మాట్లాడేందుకు లైసెన్సా అని ప్రశ్నించారు. అసలు సచిన్ రాజ్యసభకు నామినేట్ అయ్యింది యూపీఏ హయాంలోనే అని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణం చేసిన నాటి నుంచి సభ 348 రోజులు జరిగిందని, అయితే ఆ దిగ్గజ ఆటగాడు సభకు హాజరైంది కేవలం 23 రోజులు మాత్రమేనని రేణుక ఎద్దేవా చేశారు. అటువంటి సభ్యుడికి మాట్లాడే అవకాశం రాకపోతే ఏదో కొంపలు ములిగిపోయినట్లు బీజేపీ వారు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. భారతరత్న పురస్కారం పార్లమెంటులో మాట్లాడేందుక లైసెన్స్ కాదని ఆమె అన్నారు.