Begin typing your search above and press return to search.

సచిన్ సామాన్య ప్రేక్షకుడిలా..

By:  Tupaki Desk   |   15 July 2017 10:52 AM GMT
సచిన్ సామాన్య ప్రేక్షకుడిలా..
X
తన బ్యాటింగ్ విన్యాసాలతో కోట్లాది మందిని అభిమానులుగా మార్చుకుని.. తన కోసం స్టేడియాలకు పరుగెత్తుకొచ్చేలా చేసిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. అతడికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి.. ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే క్రికెటర్ గా అంత గొప్ప స్థాయిని అందుకున్న సచిన్ కు కూడా కొన్ని అభిరుచులున్నాయి. అతను కూడా ఓ సామాన్య అభిమానిగా మారిపోతుంటాడు అప్పుడప్పుడూ. తన అభిమాన క్రీడాకారుడి కోసం ప్రతి ఏటా విదేశీ పర్యటన చేస్తాడు సచిన్. స్టేడియానికి వెళ్లి ఆ క్రీడాకారుడు ఆడే ప్రతి మ్యాచూ ఆసక్తిగా గమనిస్తాడు. సచిన్ అంతగా అభిమానించే ఆ ప్లేయర్ మరెవరో కాదు.. స్విస్ టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్.

ఫెదరర్ కు సచిన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసింది కొద్దిమందికే. అతడి అభిమానం ఏ స్థాయిదంటే ఫెదరర్ కోసమే పదేళ్లుగా ప్రతి సారీ క్రమం తప్పకుండా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ చూసేందుకు లండన్ వెళ్తున్నాడు. క్రికెట్ కెరీర్లో కొనసాగుతున్నపుడు కూడా ఖాళీ దొరికితే వింబుల్డన్ లో వాలిపోవడం సచిన్ అలవాటు. ముఖ్యంగా ఫెదరర్ సెమీస్.. ఫైనల్ దశలకు చేరుకున్నపుడు సచిన్ కచ్చితంగా మ్యాచ్ చూడాల్సిందే. ఆట నుంచి రిటైరయ్యాక ఏ ఇబ్బందులూ లేకపోవడంతో ప్రతి సంవత్సరం వింబుల్డన్ జరిగే సమయంలో నెల రోజుల పాటు ఇంగ్లాండ్ పర్యటన పెట్టుకుంటున్నాడు సచిన్. తన భార్యా పిల్లలతో కలిసి అక్కడే ఉంటూ ఫెదరర్ ఆటను ఆస్వాదిస్తుంటాడు. ప్రతిసారీ రోజర్ తో కలిసి ఫొటోలు కూడా దిగుతుంటాడు. వింబుల్డన్ వీఐపీ ప్రొటోకాల్ ప్రకారం సూటేసుకుని జెంటిల్మన్ లాగా స్టేడియానికి హాజరవుతుంటాడు సచిన్. అతడి కొడుకు అర్జున్ లండన్లోనే క్రికెట్ శిక్షణ తీసుకుంటుండటం విశేషం.