Begin typing your search above and press return to search.

సచిన్ అంజలి పెళ్లికి కారణం అయిన 'ఆమె' ఎవరు?

By:  Tupaki Desk   |   20 Feb 2022 8:30 AM GMT
సచిన్ అంజలి పెళ్లికి కారణం అయిన ఆమె ఎవరు?
X
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్ తన వివాహానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లి జరగడానికి ముఖ్య కారణం తన భార్య అయిన అంజలి అని చెప్పాడు. వారి వివాహం జరగడానికి ప్రముఖ పాత్ర పోషించింది అంజలి అనే విషయాన్ని స్పష్టం చేశారు.

తాము ప్రేమించుకున్న కానీ పెద్దలను ఒప్పించే బాధ్యత అంజలి తీసుకుందని అన్నారు. తను చూపిన చొరవ కారణంగా ఇద్దరు ఒక్కటైనట్లు గుర్తు చేసుకున్నారు. తాను అత్యంత చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. అదే సయమంలో క్రికెట్ తో పాటు అంజలీ ని కూడా ప్రేమించినట్లు చెప్పుకొచ్చారు.

తాను 16 ఏళ్ల వయసులో క్రికెట్ లోకి అడుగు పెట్టగా.. అంజలి తనకు 17 ఏళ్లు వచ్చిన తర్వాత తన జీవితంలోకి అడుగుపెట్టినట్టు పేర్కొన్నాడు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావశీలి అయిన క్రికెటర్స్ లో ఒకరైన సచిన్ అతి చిన్న వయసులోనే క్రికెట్ లో అడుగు పెట్టాడు. దిన దినాభివృద్ధి చెందుతూ.. అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేశారు. కేవలం సొంత గడ్డ భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులు కలిగి ఉన్నాడు ఈ క్రికెటర్.

ఇండియా తరఫున క్రికెట్ లో అడుగుపెట్టిన సచిన్.. సుమారు 20 ఏళ్లకు పైగా టీమిండియాకు తన సేవలను అందించాడు.

ఈ సమయంలో ఓడిపోతున్న మ్యాచ్ లు కూడా ఒంటి చేత్తో గెలిపించి సాహో టీం ఇండియా అని అనిపించాడు. మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ సారధ్యంలో సచిన్ ఎన్నో మ్యాచ్ లు ఆడాడు. ఆనాడు సచిన్ గెలిపించిన మ్యాచ్ లు నాటి క్రికెట్ అభిమానులు ఎంతగానో అలరించాయి.

అంతేకాకుండా క్రికెట్ లో ఎవరికీ సాధ్యం పడినటువంటి రికార్డులను కూడా అలవోకగా సాధించిన ఘనత కేవలం సచిన్ కు మాత్రమే దక్కుతుంది. అందుకే అభిమానులు కూడా సచిన్ ను మనం దేశంలో క్రికెట్ గాడ్ గా పిలుస్తారు. ముఖ్యంగా పాకిస్తాన్ తో భారత్ కు జరిగిన ఎన్నో మ్యాచ్ ల్లో సచిన్ ఆట తీరును చూసి చాలామంది మంత్ర ముగ్దులు అయ్యారు అంటే అది కేవలం బ్యాట్ పట్టిన వేళ విశేషమే.

ఇలాంటి సచిన్ ఒకవైపు క్రికెట్ లో అద్భుతాలు సృష్టిస్తూనే... మరో వైపు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా అంజలి కి చాలా దగ్గరగా ఉన్నారు. సచిన్ కు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అంజలి తో ప్రేమలో పడ్డాడు. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే వీరి పెళ్లి అయ్యింది. అయితే ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం మాత్రం కచ్చితంగా అంజలి నే అని సచిన్ వివరించారు.

తాను న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా అంజలి తనను కలిసి పెళ్లి చేసుకుందామని అడిగినట్లు తెలిపారు. అదే సమయంలో తాను మంచి ఫామ్ లో ఉండటం కారణంగా ఇంట్లో వాళ్ళను నువ్వే ఒప్పించాలని అంజలి కి చెప్పినట్లు పేర్కొన్నాడు.

అందుకే ఆమె ఓకే చెప్పిందని అన్నాడు. దీంతో అంజలి నే ఇరు కుటుంబాలను ఒక చోట చేర్చి తమ ప్రేమ ఈ విషయాన్ని చెప్పి ఒప్పించినట్లు స్పష్టం చేశారు.

భారత్ తరఫున ఆడిన సచిన్.. మొత్తంగా 100 సెంచరీలు చేశాడు. వన్డేల్లో ఇప్పటివరకు ఎవరికీ దక్కని ఫస్ట్ డబుల్ సెంచరీ ఫీట్ ను కూడా తానే సాధించాడు. ఇలా సుమారు 24 ఏళ్ల పాటు టీమిండియాకు ఆడి తన విశిష్ట సేవలు అందించారు. చివరగా 2013 లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.