Begin typing your search above and press return to search.
ఈ ఊహాగానాలు నిజమేనా సచిన్?
By: Tupaki Desk | 12 April 2015 8:14 AM GMTఅలవాటుపడిన ప్రాణం... ఆ(డ)గకుండా ఉంటుందా అన్నట్లు... సచిన్ కి మళ్లీ బ్యాట్ పట్టుకోవాలనీ, మైదానంలో అభిమానుల కేరింతల మధ్య తన బ్యాటింగ్ విన్యాసాలు చూపించాలనీ, బంతిని బౌడరీకి తరలిస్తుంటే స్టేడియంలో అరుపులను అస్వాధించాలని కోరుకుంటున్నాడా? ప్రస్తుతం ఇవే ఊహాగానాలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఏదో గాలి వార్త అయితే లైట్ తీసుకోవచ్చు కానీ... ఇందుకు బీజం వేసింది మాత్రం సచిన్ కావడంతో ఊహాగానాలకు మరింత పెద్ద రెక్కలొచ్చాయి!
తాజాగా సచిన్ హెల్ మెట్ తీస్తూ ముంబై ఇండియన్స్ జెర్సీతో ఉన్న ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేసి... ఆ ఫోటో కింద "Guess whatttt?" అని రాశాడు. ఇంకేముంది... ఎవరి స్థాయిలో వారు తమ తమ క్రియేటివిటీకి పని చెప్పి... ఫైనల్ గా సచిన్ మరలా మైదానంలోకి రాబొతున్నాడు అని తేల్చారు.
2013 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఐకాన్‌గా వ్యవహరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ ఐపియల్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత అతను 2013లో ట్వంటీ20 క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే ఈ ఎడిషన్‌లో కూడా సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున మైదానంలోకి దిగుతాడా అనిపించేట్లు ఆ ఫొటో ఉండడంతో సచిన్ అభిమానుల ఆనందానికి అవదులు లేవు! మీరు కూడా ఆలోచించండి... "Guess whatttt?"