Begin typing your search above and press return to search.

సింధులో గ్లామర్ కోణం బయటకు వచ్చేసింది

By:  Tupaki Desk   |   28 Aug 2016 9:26 AM GMT
సింధులో గ్లామర్ కోణం బయటకు వచ్చేసింది
X
పీవీ సింధు అన్న వెంటనే ఆరడుగుల అమ్మాయి గర్తుకు వస్తుంది. పక్కింటి అమ్మాయిలా కనిపించే సింధును గ్లామర్ గర్ల్ గా ఎవరూ ఊహించుకొని ఉండరు. నిజానికి రియో ఒలింపిక్స్ లో విజయం సాధించే వరకూ ఆమె మీద మీడియా ఫోకస్ తక్కువనే చెప్పాలి. సింధు సాధించిన సిల్వర్ తో.. ‘సిల్వర్ సింధు’గా మారిన నేపథ్యంలో ఆమెకు భారీ ప్రచారమే లభించింది. ఆమె సాధించిన విజయం.. పతకంతో క్రియేట్ అయిన హైప్ అంతా ఇంతా కాదు. దీనికి తోడు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సింధును సన్మానించే విషయంలో పడిన పోటీతో ఆమె రేంజ్ మరింత పెరిగిపోయింది.

ఒలింపిక్స్ విజేతలు గతంలో కొద్ది మంది ఉన్నా.. సింధుకు వచ్చినంత ఇమేజ్ ఈ మధ్య కాలంలో మరెవరికీ రాలేదని చెప్పాలి. ఈ కారణంతోనే కావొచ్చు.. సిల్వర్ సాధించిన కొద్ది రోజులకే ఆమె బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఎప్పటిలానే సింధు పక్కింటి అమ్మాయిలానే వ్యవహరించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో నార్మల్ గానే ఉన్న సింధు.. మరికొన్ని కార్యక్రమంలోనూ నార్మల్ గానే అటెండ్ అయ్యింది. బెజవాడలో నిర్వహించిన కృష్ణమ్మ హారతి సందర్భంగా తెలుగింటి అమ్మాయిలా రెఢీ అయి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

తాజాగా మాత్రం అందుకు భిన్నంగా రెఢీ అయిన ఆమె.. అందరిని సర్ ప్రైజ్ చేసింది. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ ఒలింపిక్స్ విజేతలకు బీఎండబ్ల్యూ కార్లను బహుకరించేందుకు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సింధు.. ఆమె దరించిన డ్రెస్ కొత్త సింధును పరిచయం చేసిందని చెప్పాలి.

నిన్నటి వరకూ క్రీడాకారిణిగా.. తెలిగింటి అమ్మాయిలా మాత్రమే కనిపించిన సింధు.. సచిన్ కార్యక్రమానికి అందుకు భిన్నమైన ఆహార్యంతో రావటం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిందని చెప్పాలి. గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నప్పటికీ సింధు తన డ్రెస్సింగ్ విషయంలో నార్మల్ గానే ఉండేది. గ్లామర్ అన్న పదాన్ని తన దరికి చేరకుండా జాగ్రత్త తీసుకునేది. తాజాగా అందుకు భిన్నంగా రెఢీఅయి వచ్చిన ఆమె తనలోని కొత్తకోణాన్ని ప్రదర్శించిందని చెప్పాలి.

సచిన్ హాజరైన కార్యక్రమానికి గ్లామరస్ గా వచ్చిన సింధు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే కార్యక్రమానికి హాజరైన మరో ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ కానీ.. పతకం సాధించకున్నా దేశ ప్రజల మనసుల్ని దోచుకున్న దీపా కర్మాకర్ ల డ్రెస్సింగ్ నార్మల్ గా ఉంది. సింధుకు.. వీరిద్దరి మధ్య డ్రెస్సింగ్ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపించింది. నిన్నటి వరకూ తన ఆటతోనే నలుగురి దృష్టిలో పడిన సింధు.. తాజాగా తన గ్లామర్ తో అందరి కళ్లు తన వైపు తిప్పేలా చేసిందని చెప్పాలి. సచిన్ హాజరైన కార్యక్రమంలో సింధు డ్రెస్సింగ్ దెబ్బకు కెమేరా కళ్లన్ని ఆమె వైపే ఫోకస్ అయిన తీరు చూస్తేనే సింధు ఎంత కొత్తలా కనిపించిందన్న విషయం అర్థమవుతుంది.