Begin typing your search above and press return to search.
బస్తాల్లో నోట్లు తీసుకొచ్చి చించి తగలబెట్టారు
By: Tupaki Desk | 10 Nov 2016 7:15 AM GMTపెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా సంచలన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం అక్రమార్కులు.. బ్లాక్ మనీ కుబేరుల గుండెల్లో ఎన్ని రైళ్లు పరిగెడుతున్నాయో తెలిపే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన బరైలీలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఏం చేయాలో తోచని పరిస్థితి చాలామందికి ఏర్పడింది.
ఈ విషయంపై బరైలీకి చెందిన పారిశ్రామికవేత్త ఒకరు ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. తన దగ్గరున్న రూ.500.. రూ.వెయ్యి నోట్లను బస్తాల కొద్దీ బయటకు తీయించి కార్మికులతో చించి వేయించి.. వాటిని ముక్కలు ముక్కలుగా చేయించారు. అనంతరం వాటిని తగలబెట్టేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది.
పెద్ద ఎత్తున జరిగిన నోట్లను కాల్చేసిన సమాచారం అక్కడి స్థానికులకు చేరింది. ఆ తర్వాత కథ మామూలే. ఈ విషయాన్ని కథలు కథలుగా ప్రచారం జరగటం.. పోలీసుల దృష్టికి వెళ్లటంతో వారు రంగ ప్రవేశం చేశారు. చేతిలో ఉన్న డబ్బు పోవటమే కాదు.. ఇప్పుడు సదరు నల్లధనానికి సంబంధించి లెక్కలు చెప్పాల్సిన ఇబ్బందికర పరిస్థతుల్లో సదరు పారిశ్రామికవేత్త పడినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ ఘనకార్యానికి పాల్పడిన పారిశ్రామికవేత్త ఎవరన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/