Begin typing your search above and press return to search.
చికెన్ ప్రియులకు చేదు వార్త.. కొనాలంటే పర్సు ఖాళీనే
By: Tupaki Desk | 12 May 2022 1:12 AM GMTగతంతో పోల్చినప్పుడు.. కొన్నేళ్లుగా వెజ్ స్థానే.. నాన్ వెజ్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. వెయిట్ లాస్ అనేటోళ్లు.. ఇతర డైట చార్ట్ లను ఫాలో అయ్యే వారు సైతం.. నాన్ వెజ్ వద్దకు వచ్చేసరికి అప్పటివరకు తాము చెప్పిన మాటల్ని.. చేస్తున్న దానిని పక్కకు పెట్టేసే వైనం కనిపిస్తుంది. అప్పుడప్పుడు కూరగాయల ధరలు మండే తీరులోనే.. కొన్ని సందర్భాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటేస్తున్న పరిస్థితి. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.300 మార్క్ దాటిపోవటంతో నాన్ వెజ్ ప్రియులు హాహాకారాలు చేస్తున్నారు.
నాన్ వెజ్ తినేటోళ్ల ఫస్ట్ ఛాయిస్ చికెనే. అంతలా ఇష్టపడే వారందరిని దెబ్బ తీస్తోంది చికెన్ ధరలు. పెరిగిన చికెన్ ధరలకు తగ్గట్లే మటన్ ధరలు సైతం మండిపోతున్నాయి. దీంతో.. ముక్క తినాలంటే వంద లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. ఇంతకీ చికెన్ ధరలు పెరగటానికి కారణం ఏమిటని ఆరా తీసినప్పుడు వచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.
చికెన్ ధరలు పెరగటానికి కారణాల్లో వేసవిలో ఎండ తీవ్రతకు పెద్ద ఎత్తున కోళ్లు మరణిస్తున్నాయి. దీంతో.. ఆ నష్టాల భర్తీకి ధర పెంచటం మినహా మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. ఇది సరిపోనట్లుగా కోళ్లకు వేసే దాణా ధరలు పెరిగిపోవటం.
మరి.. వీటి ధరల పెరుగుదలకు మోడీ మాష్టారు రోజువారీగా పెంచేసే పెట్రోల్.. డీజిల్ ధరల మోత కూడా కారణం. ఏతావాతా చెప్పేదేమంటే.. అన్ని కలిసి వచ్చినట్లుగా ఇప్పుడు చికెన్ ధరలు అమాంతం పెరిగిపోవటానికి ఇవన్నీ కారణాలుగా మారినట్లుగా చెబుతున్నారు.
చికెన్ కేజీ రూ.300 ప్లస్ కాగా.. ఇక బోన్ లెస్ చికెన్ ధరలు మటన్ రేటుతో సమానంగా ఉన్నట్లు చెబుతున్నారు. కొన్నిచోట్ల కిలో బోన్ లెస్ చికెన్ ధర దగ్గర దగ్గర రూ.600 వరకు ఉందని అంటున్నారు. ఐదు నెలల క్రితం కేజీ చికెన్ ధర రూ.100 ఉంటే.. ఇప్పుడు ఇంత భారీగా పెరిగినట్లుగా చెబుతున్నారు.
ఫౌల్ట్రీ కోళ్ల ధరకు ఏమాత్రం తీసిపోని రీతిలో నాటుకోడి రేటు కూడా బాగా పెరిగిపోయినట్లు చెబుతున్నారు. కేజీ నాటు కోడి ధర రూ.480కు వచ్చేసింది. ఇంతింత ధరలతో చికెన్ తినే పరిస్థితి ఉందా? అంటూ వాపోతున్నారు నాన్ వెజ్ ప్రియులు. నిజమే.. చికెన్ తినాలంటే పర్సు ఖాళీ అయ్యేలా ధరలు మారాయని చెప్పక తప్పదు.