Begin typing your search above and press return to search.

సన్​రైజర్స్​ ఫ్యాన్స్​కు స్యాడ్​ న్యూస్​..! నటరాజన్​ అవుట్​

By:  Tupaki Desk   |   23 April 2021 3:30 AM GMT
సన్​రైజర్స్​ ఫ్యాన్స్​కు స్యాడ్​ న్యూస్​..!  నటరాజన్​ అవుట్​
X
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నటరాజన్​.. అనతి కాలంలో తానేంటో నిరూపించుకున్నాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు బౌలింగ్​ చేసి తన సత్తా చాటాడు. టీమిండియా జట్టుకు సైతం ఎంపికయ్యాడు. క్రికెట్​లో రాణించాలంటే పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. గత ఐపీఎల్​ లో అంతర్జాతీయ ఆటగాళ్లను సైతం ముప్పుతిప్పలు పెట్టి ఎంతో పాపులర్​ అయ్యాడు. ఇక బీసీసీఐ కూడా అతడి ప్రతిభను గుర్తించి జట్టులో స్థానం కల్పించింది. అన్ని ఫార్మాట్లలోనూ అతడికి అవకాశం కల్పించారు.

నటరాజన్​ సన్​ రైజర్స్​ హైదరాబాద్​ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. నటరాజన్​ ఎంట్రీతో ఆ టీం బౌలింగ్​ ఎంతో పటిష్ఠంగా మారింది. గత ఏడాది సత్తా చాటిన నటరాజన్​ ఈ సారి జట్టుకు ఎక్కువ మ్యాచ్​లు ఆడలేకపోయాడు. ప్రస్తుతం అతడు మోకాలు గాయంతో బాధపడుతున్నాడు.
ప్రస్తుతం అతడు ఇంకా మోకాలి గాయం నుంచి కోలుకోలేదని సమాచారం. దీంతో ఇక ఈ ఐపీఎల్​ అతడు ఆడలేకపోవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.

నటరాజన్​ ఇప్పటికే రెండు మ్యాచ్​లు ఆడాడు. ఆర్​సీబీ జట్టుపై, కేకేఆర్​పై అతడు ఆడాడు. కానీ ఆ తర్వాత అతడి స్థానంలో ఖలీల్​ అహ్మద్​కు అవకాశం వచ్చింది. మోకాలి గాయంతో నటరాజన్​ బాధపడుతుండటంతో అతడిని పక్కకు పెట్టినట్టు సమాచారం.మరోవైపు త్వరలోనే టీ20 వరల్డ్​ కప్​ కూడా ఉంది. టీ20 మ్యాచ్​లకు నటరాజన్​ ఫిట్​ గా ఉండాలంటే అతడిని ప్రస్తుతం విశ్రాంతి లో ఉంచడమే ఉత్తమమని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్​ లు ఆడినప్పటికీ ఒక్క మ్యాచ్​ లో మాత్రమే విజయం సాధించగలిగింది.

ఆ జట్టుకు పటిష్ఠమైన బౌలర్లు ఉన్నప్పటికీ.. మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్లు ఫామ్​లో లేకపోవడంతో గెలవలేకపోతోంది. మరోవైపు సన్​రైజర్స్​కు లక్​ ఫ్యాక్టర్​ కూడా కలిసి రావడం లేదు. గత ఏడాది ఆ ప్రముఖ బౌలర్​ భువనేశ్వర్​ గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడేమో నటరాజన్​ దూరమయ్యాడు. ప్రస్తుతం సన్​రైజర్స్​ తరఫున భువనేశ్వర్​ కుమార్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ, బాసిల్ తంపి, ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ బౌలర్లుగా ఉన్నారు.