Begin typing your search above and press return to search.
నెల గడిపితే సినిమా ఛాన్స్ అంట
By: Tupaki Desk | 30 Oct 2015 11:27 AM GMTసినిమా రంగం గురించి చాలామంది చాలానే చెబుతుంటారు. కొందరు వాటిని కొట్టిపారేస్తుంటారు. మరికొందరు.. వామ్మో సినిమా ఇండస్ట్రీ అని అనేస్తుంటారు. భారతీయ చిత్ర పరిశ్రమే కాదు.. ఇతర దేశాల్లోని చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి ఇబ్బంది ఉంటుందన్న విషయాన్ని ఒక ప్రముఖ నటి కుండబద్ధలు కొట్టి సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ నటిగా పేరు ప్రఖ్యాతులున్న ఆమె దగ్గరకు ఐదారు కాంట్రాక్టులు ముందు పెట్టి.. నెల రోజులు గడిపితే ఛాన్స్ ఇస్తామని ఆఫర్లు ఇస్తుంటారట. ఎక్కువమంది ఇలాంటి వాళ్లే ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంచలనం సృష్టిస్తున్న ఆ నటి ఎవరంటే..?
సదాఫ్ తహురియాన్ అన్న పేరు వింటే.. ఎవరీమె? అని క్వశ్చన్ మార్క్ వేస్తారు. చూడగానే ఆకట్టుకునే రూపంతో పాటు.. ఏ అందాల ఎక్కడ.. ఎంత ఉండాలో.. అంతే ఉండే ఈ అమ్మడు మనకు కొత్త కానీ ఇరానీయులకు సుపరిచితురాలు. తన అందంతో.. నటనతో ఇప్పటికే పిచ్చెక్కించే ఈ భామ ఈ మధ్యన కాస్తంత ఫ్యాఫన్ బుల్ గా కనిపించాలని.. జుట్టు కనిపించేలా కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. అంతే.. ఇరాన్ సమాజం భగ్గుమంది.
ఎందుకంటే.. అక్కడ ఏ మహిళ అయినా తన జుట్టను బయటకు కనిపించేలా ప్రదర్శించకూడదు. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాలనే ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించిన దానికి ఇరాన్ సాంస్కృతిక శాఖ మండిపడుతోంది. అంతేకాదు. సోషల్ మీడియాలో ఉన్నజుట్టు కనిపేంచే ఫోటోలకు గ్రాఫిక్స్ తో హిజాబ్ తగిలించేశారు. మొత్తంగా జుట్టు కనిపించేలా ఫోటోలు దిగి ఆమె సంచలనంగా మారింది. అయితే.. తాను చేసిన పనికి ఇరాన్ సమాజం నుంచి ఇంత తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుందని ఊహించని ఆమె..మాతృదేశంలో ఉండలేక ప్రస్తుతం దుబాయ్ లో ఉంటోంది. మరోవైపు.. తాను చేసిన పని గురించి ఎంతమాత్రం ఫీల్ కాని ఆమె.. సినీ పరిశ్రమలోని చీకటి కోణాల్ని ఏకరువు పెట్టుకొచ్చింది.
తన నటన కంటే కూడా తననే చూస్తుంటారని.. షాట్ అయిపోయిన వెంటనే చెవిలో ఏదో ఒకటి చెప్పాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తుందని ఆమె ఆరోపించింది. అంతేకాదు.. నాలుగైదు కాంట్రాక్టులు తీసుకొచ్చేసి.. నెల గడిపితే ఆఫర్ అంటూ ఊరిస్తారని.. ఇలాంటివారే ఎక్కువగా కనిపిస్తారని మండిపడుతోంది. ఇప్పటివరకూ ఆమె ఫోటోలు మంటలు పుట్టిస్తే.. తాజాగా ఆమె మాటలు కూడా అంతే సంచలనంగా మారాయి. తాజా మాటలతో సదాఫ్ కు మరెన్ని తలనొప్పులు రానున్నాయో..? అని ఆమెను విపరీతంగా అభిమానులు వాపోతున్నారుట.