Begin typing your search above and press return to search.
సదానంద పాతపాటే పాడారా?
By: Tupaki Desk | 5 Aug 2015 8:31 AM GMTతెలుగు రాష్ట్రాల పట్ల మోడీ సర్కారు ఒకేతీరుగా వ్యవహరిస్తుందా? అంటే అవుననే వాదన వినిపిస్తోంది. మంగళవారం లోక్‌సభలో చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్రం పట్ల ఒకింత సానుకూలంగా.. ఏపీ పట్ల అలాంటిదేమీ లేదన్నట్లు కనిపించినా.. అలాంటిదేమీ లేదన్న విషయం బుధవారం సభలో జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎంపీలు డిమాండ్ చేస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ ఎంపీలు డిమాండ్ చేయటం తెలిసిందే. ఈ రెండు అంశాలకు కేంద్ర మంత్రులు రాజ్ నాధ్.. వెంకయ్యలు సమాధానం ఇవ్వటం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేస్తామని.. వారి సమస్యల విషయంలో సానుకూలంగా స్పందిస్తామని రాజ్ నాథ్ పేర్కొన్నారు. ఇక.. ఏపీ విషయానికి వస్తే.. న్యాయం చేస్తామన్న ఆయన ప్రత్యేక హోదా గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా తన ప్రసంగాన్ని ముగించారు.
మరోవైపు.. ప్రత్యేక హైకోర్టు కోసం ప్రశ్నించిన తెలంగాణ ఎంపీలకు సమాధానమిచ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారని.. దీనిపై న్యాయశాఖ వద్ద కసరత్తు జరుగుతుందని.. త్వరలోనే దీనిపై తగిన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
ఏపీ..తెలంగాణ అంశాల విషయంలో ఇద్దరు కేంద్రమంత్రులు ఇచ్చిన సమాధానాలు చూసినప్పుడు.. తెలంగాణ ఎంపీల డిమాండ్ విషయంలో కేంద్రం కాస్తంత సానుకూలంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే.. అదంత నేతి బీరకాయ చందం అన్న విషయం తాజాగా మరోసారి రుజువైంది. హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్ర న్యాయశాఖా మంత్రిసదానంద గౌడ్ మాట్లాడుతూ.. దీనిపై ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేసిందని.. అందువల్ల అది సబ్ జ్యూడీయస్ అవుతుందని సదానంద తెలిపారు. వెంకయ్య మాటలు తెలంగాణ ఎంపీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపితే.. తాజాగా సదానంద గౌడ వ్యాఖ్యలు నిరుత్సాహానికి కలిగిస్తున్న పరిస్థితి. మొత్తంగా రెండు తెలుగురాష్ట్రాల విషయంలో మోడీ సర్కారు వైఖరి ఒకటిలానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.