Begin typing your search above and press return to search.
అమ్మాయిని తిట్టించిన కేంద్రమంత్రి
By: Tupaki Desk | 25 Dec 2017 11:11 AM GMTఏదో చెప్పాలనుకుంటే మరేదో అయ్యిందన్నట్లుగా మారింది కేంద్రమంత్రి సదానంద గౌడ్ వ్యవహారం. ఆయన ఏదో సందేశం ఇస్తున్నట్లు చేసిన పనికి నెటిజన్లు రివర్స్ లో రియాక్ట్ అయ్యారు. అయితే.. తిట్టు కేంద్రమంత్రికి పడకుండా ఆయన పోస్ట్ చేసిన ఫోటోలోని యువతికి పడటం గమనార్హం. ఇంతకీ.. కేంద్రమంత్రి ఏం చేశారంటే..
కర్ణాటకలోని మంగళూరులో రామకృష్ణ మిషన్ స్వచ్ఛ మంగళూరు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా హాజరైన కార్యకర్తల ఫోటోల్లో ఒక మహిళ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ మహిళ తన చంటి పాపను తన ముందు భాగంలో కట్టుకొని చీపురుతో వీధుల్ని శుభ్రం చేస్తున్న వైనాన్ని అభినందించారు. ఏడాది కొడుకును చంకన వేసుకొని మరీ వీధుల్ని శుభ్రం చేయటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
కేంద్రమంత్రి అభినందనలు సంగతేమో కానీ.. నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలోని అమ్మాయి మీద సీరియస్ అయ్యారు. ఇలా వీధుల్ని శుభ్రం చేయటం పసిపిల్లల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని.. ఈ విషయాన్ని ఆ తల్లి ఎందుకు గుర్తించటం లేదంటూ కస్సుమన్నారు. ఆ తల్లికి పిల్లల సంరక్షణ గురించి కనీస అవగాహన కూడా లేదా? అని ప్రశ్నించారు.
ఒకవేళ ఏడాది వయసున్న చిన్నారినితోనే స్వచ్ఛ మంగళూరు కార్యక్రమానికి పాల్గొనాల్సి ఉంటే.. ఆమె.. ఆ చిన్నారి ఇద్దరూ మాస్క్ ధరించి ఉంటే మంచిదని.. అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ స్వచ్ఛ కార్యక్రమం ఏమిటంటూ సీరియస్ అయ్యారు. మంచి చేయటం తప్పేం కాదు. కానీ.. అది మనల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.