Begin typing your search above and press return to search.
ట్రంప్ ను ప్రశంసించిన ముస్లిం నియంత కూతురు
By: Tupaki Desk | 22 Dec 2016 10:30 PM GMTఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ గుర్తుండే ఉంటారు కదా. అగ్రరాజ్యం అమెరికా కక్ష గట్టి మరీ ఆయన్ను అంతమొందించిన సంగతి తెలిసిందే. తాజాగా సద్దాం కూతురు రగద్ హుస్సేన్ అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఎన్నికల సమయంలో ఇరాక్ యుద్ధంపై ట్రంప్ కొన్ని కామెంట్స్ చేశారు. అసలు అమెరికా ఆ యుద్ధానికి వెళ్లకుండా ఉంటే బాగుండేదన్నారు. డిబేట్ సందర్భంగా కూడా ఆ అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సద్ధాం హుస్సేన్ కూతురు గుర్తు చేసుకుంది.
ప్రస్తుతం జోర్డాన్ రాజధాని అమ్మాన్ లో ఉంటున్న రగద్ సీఎన్ ఎన్ ఛానల్ కు ఫోన్ లోనే ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ట్రంప్ పై ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. రాజకీయాలకు ట్రంప్ కొత్తే కానీ అతనిలో రాజకీయ సున్నితత్వం ఉందని ప్రశంసించింది. గతంలో అమెరికాను పాలించిన నేతల కన్నా, ట్రంప్ భిన్నంగా ఉన్నట్లు రగద్ హుస్సేన్ అభిప్రాయపడింది. ఇరాక్ యుద్ధం విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పును ట్రంప్ ఎత్తి చూపారని, అంటే ఇరాక్ యుద్ధం వల్ల అమెరికా చేసిన పొరపాటును అతను గ్రహించారని, తన తండ్రి సద్ధాం హుస్సేన్ కు ఎలా అన్యాయం జరిగిందో ఆయనకు తెలుసు అని రగద్ అభిప్రాయపడింది.
కాగా..1979 నుంచి 2003 వరకు ఇరాక్ ను సద్ధాం పాలించారు. ఆ సమయంలో షియాల ఊచకోత కొనసాగింది. అయితే మానవహనన ఆయుధాలు ఉన్నాయనన్న నెపంతో అమెరికా సేనలు ఇరాక్ లో భారీ విధ్వంసం సృష్టించాయి. సద్ధాంను యుద్ధ నేరాల కింద అరెస్టు చేశారు. 2006లో సద్దాంను ఉరి తీశారు. దాన్ని ఇరాకీ టీవీ లైవ్ లో కూడా చూపించింది. కానీ తన తండ్రిని ఉరి తీసిన వీడియోను మాత్రం ఎప్పుడూ చూడనని రగద్ హుస్సేన్ పేర్కొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/