Begin typing your search above and press return to search.
సద్దాం హుస్సేన్ లో ఈ కోణం తెలిస్తే షాకవుతారు
By: Tupaki Desk | 8 Sep 2020 1:30 AM GMTసద్దాం హుస్సేన్....ప్రపంచ దేశాలలో పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచంలోని చమురు కంపెనీల సామ్రాజ్యవాదులను గడగడలాడించిన మాజీ ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను కొందరు నియంత అని పిలుస్తారు. ఇరాక్‌ను ఆధునీకరణ వైపు నడిపించిన సద్దాం...విదేశీ సామ్రాజ్యవాదుల చేతిలో ఉన్న ఇరాక్ చమురు సంస్థలను స్వాధీనం చేసుకుని జాతీయం చేశారు. దాదాపు పాతికేళ్లు ఇరాక్ ను పాలించిన సద్దాం... అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయారు. ఆ తర్వాత అమెరికా 2003లో అమెరికా సైన్యానికి చిక్కిన సద్దాంను...2006లో ఇరాక్ ప్రభుత్వం ఉరి తీసింది. తనకు వ్యతిరేకంగా ఉన్న షియా ముస్లింలను, తిరుగుబాటుదారులను సున్నీ ముస్లిం అయిన సద్దాం ఊచకోత కోశారన్న ఆరోపణలున్నాయి. ఇలా, కొంతమంది ఇరాకీయులకు యుద్ధ నేతగా, మరికొందరికి నియంతగా, ప్రపంచానికి క్రూరుడిలా కనిపించే సద్దాంలో మరో కోణం కూడా ఉంది. ఈ నియంత ఓ రొమాంటిక్ రచయిత అని...అందులో ఆయన రాసిన ఓ పాపులర్ నవల ద్వారా వెల్లడైంది. సద్దాం రాసిన `Zabiba and the King’ అనే నవల ఇపుడు హాట్ టాపిక్ అయింది.
ఈ నవలలో ప్రధాన పాత్రలో జబీబా అనే అమ్మాయికి తన క్రూరుడైన భర్త నుంచి వేధింపులు, అత్యాచారాలు ఎదురవుతుంటాయి. జబీబాను ప్రేమించిన ఇరాక్ రాజు తన ప్రేయసిని ఇబ్బందిపెట్టిన వారిపై రివేంజ్ తీర్చుకుంటాడు. ఈ క్రమంలో రాజు కూడా మరణిస్తాడు. 2000 సంవత్సరంలో ఇరాక్ లోని పరిస్థితులకు అద్దంపట్టేలా ఉన్న ఈ నవల ఇపుడు అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది. ఈ నవలలోని జబీబా అనే పాత్రను ఇరాక్ ప్రజలుగా, క్రూరమైన భర్తగా అమెరికాను సద్దాం అభివర్ణించాడని చర్చ జరుగుతోంది. సద్దాం రచించిన నాలుగు నవలలలో ఒకటైన ఈ నవల పాపులర్ అయింది. అయితే, నియంత అయిన సద్దాం ఈ టైప్ నవల రాశాడా అన్న చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా...నియంతలోనూ ఓ కవి ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.