Begin typing your search above and press return to search.
అఖిలేష్ కు మద్దతిచ్చిన ములాయం రెండో భార్య
By: Tupaki Desk | 7 March 2017 3:28 PM GMTయూపీలో అధికార సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో మొదలైన రచ్చ కొలిక్కి వచ్చినట్లుంది. ఆయన రెండో భార్య కేంద్రంగా సాగుతున్న వివాదం సెట్ అయిందంటున్నారు. తాజాగా ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన యాదవ్ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ భారీ మెజార్టీతో గెలవాలని.. అఖిలేష్ యాదవే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్రంలో మెరుగైన పాలన చేయడం ఎస్పీతోనే సాధ్యమవుతుందని ములాయం రెండో భార్య వివ్లేషించారు.
ఎన్నికల సమయంలో కుటుంబంలో వచ్చిన వివాదాలు కొంచెం బాధ కలిగించాయని సాధనయాదవ్ పేర్కొన్నారు. తానేవరిని నిందించలేదని స్పష్టం చేశారు. మంచి పనులు చేసి చెప్పుకోవద్దని తమ నాన్న చెప్పేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలిపారు. శివపాల్ యాదవ్ పార్టీ కోసం, నేతాజీ కోసం చాలా కష్టపడ్డారని ఆమె చెప్పారు. శివపాల్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనను, ములాయంను అఖిలేష్ గౌరవిస్తారని స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కానీ తన కుమారుడు ప్రతీక్ యాదవ్ రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు.
కాగా, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అంశాన్ని ప్రధాని మోడీ ముస్లిం-హిందువుల సమస్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం హోలీ, దీపావళి కన్నా రంజాన్‌కు అధిక విద్యుత్ సరఫరా చేస్తూ వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆరోపిస్తూ ప్రధాని ప్రచారం చేయడం సబబు కాదని ప్రచారసభలో అఖిలేశ్ పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో వివక్ష లేదని నిరూపించే అధికారిక వివరాల్ని వెల్లడించామని గుర్తు చేశారు. ప్రధాని మోడీ ఢిల్లీలో బస చేయడాని కంటే యూపీపైనే మక్కువ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీతో కలిసి తాను చేసిన రోడ్ షో విజయవంతం అయిందన్నారు. ప్రజల మద్దతు తమకే ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/