Begin typing your search above and press return to search.
ఫైర్ బ్రాండ్ యామినీ.. ఇలా అయిపోయిందేంటి?
By: Tupaki Desk | 6 Jan 2020 5:14 AM GMTసాధినేని యామినీ.. టీడీపీ నెత్తిన పెట్టుకొని బాగా ఫోకస్ చేసిన ఈ నాయకురాలు సడన్ గా ఆ మధ్య టీడీపీని వీడడం రాజకీయాల్లో సంచలనమైంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఈ ఫైర్ బ్రాండ్ అనతికాలంలోనే ఎంతో పేరు సంపాదించారు. చంద్రబాబూ ఆమెను ప్రోత్సహించారు. కొద్దికాలంలోనే పార్టీలో చంద్రబాబుకు, ఆయన తనయుడు నారాలోకేష్ కు చాలా దగ్గరైన నేతల్లో యామినీ ఒకరు.
అమె ప్రతిపక్షాల పై ధ్వజమెత్తిన తీరు చూసి అందరూ షాక్ తినేవారు. జగన్ ను, పవన్ ను ఇతర వైసీపీ నాయకులను పరుష పదజాలంతో దూషించిన విధానం రాజకీయాల్లో సంచలనమైంది. ఆమె తూటాల్లాంటి విమర్శలు టీడీపీ లో ఆమె ఖ్యాతిని అమాంతం పెంచేశాయి. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో యామిని పాపులర్ అయి పోయింది.
అయితే టీడీపీలో ఎంతో గౌరవం పొందిన యామినీ ఎందుకు ఆ పార్టీ కి రాజీనామా చేసిందనే విషయం అందరికీ షాక్ కు గురిచేసింది. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగానని యామిని చెప్పడానికి అది సహేతుక కారణంగా ఎవ్వరూ నమ్మడం లేదు.
అయితే యామిని వైదొలగడానికి కారణం టీడీపీ నంబర్ 2 నారా లోకేష్ అని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ టీడీపీలో యాక్టివ్ గా మారినప్పటి నుంచి.. చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో ఆయనపై నమ్మకం లేక.. భవిష్యత్తుపై ఆందోళనతోనే టీడీపీ నుంచి బయట కు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
అయితే యామిని మొదట బీజేపీ వర్కింగ్ ప్రెసిడింట్ జేపీ నడ్డా సమక్షం లో బీజేపీ లో చేరాలని అనుకుంది. ఆయన ద్వారా పెద్ద పదవి పొందాలనుకుంది. ఆయన ఏపీ పర్యటన రద్దు కావడంతో కడప జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఎలాంటి హామీలు పొందలేకపోయారు. దీంతో ఇప్పుడు బీజేపీలో ఎలాంటి పదవి దక్కక.. ఇటు టీడీపీని వీడి ఒంటరి అయిపోయి రెంటికి చెడ్డ రేవడిలా యామిని అయిపోందన్న టాక్ వినిపిస్తోంది. నెల రోజులుగా ఆమె నోరు విప్పడం లేదంటే బీజేపీ లో ఆమె ఇమడలేక పోతోందని.. ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదని తెలుస్తోంది. మరి ఆమె ఎప్పుడు బయటపడుతుంది? బీజేపీలో కొనసాగుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది..