Begin typing your search above and press return to search.

మళ్లీ వచ్చింది యామినీ సామీ.!

By:  Tupaki Desk   |   21 May 2020 7:00 AM GMT
మళ్లీ వచ్చింది యామినీ సామీ.!
X
అమె ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన తీరు చూసి అందరూ షాక్ తినేవారు. జగన్ ను, పవన్ ను ఇతర వైసీపీ నాయకులను పరుష పదజాలంతో దూషించిన విధానంతో రాజకీయాల్లో సంచలనంగా మారారు. వార్తల్లో నిలిచారు. ఆమె తూటాల్లాంటి విమర్శలు టీడీపీలో ఆమె ఖ్యాతిని అమాంతం పెంచేశాయి. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో యామినీ శర్మను పాపులర్ అయిపోయింది.

సాధినేని యామినీ.. టీడీపీ నెత్తిన పెట్టుకొని బాగా ఫోకస్ చేసిన ఈ నాయకురాలు సడన్ గా ఆ మధ్య టీడీపీని వీడడం రాజకీయాల్లో సంచలనమైంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఈ ఫైర్ బ్రాండ్ అనతికాలంలోనే ఎంతో పేరు సంపాదించారు. చంద్రబాబూ ఆమెను ప్రోత్సహించారు. కొద్దికాలంలోనే పార్టీలో చంద్రబాబుకు, ఆయన తనయుడు నారాలోకేష్ కు చాలా దగ్గరైన నేతల్లో ఒకరిగా యామినీ ఎదిగారు..

అయితే టీడీపీలో ఎంతో గౌరవం పొందిన యామినీ ఎందుకు ఆ పార్టీకి రాజీనామా చేసిందనే విషయం ఇప్పటికీ అంతుబట్టని విషయమే.. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగానని యామిని చెప్పడానికి అది సహేతుక కారణంగా ఎవ్వరూ నమ్మడం లేదు. టీడీపీలో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చిన విమర్శలను తట్టుకోలేకే జాతీయ పార్టీలో చేరిందనే ప్రచారం సాగింది.

మరి జాతీయ పార్టీలో చేరాక దుమ్ముదులిపిందా? యాక్టివ్ పాలిటిక్స్ చేసిందా అదీ లేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఆమె నోరు మూగబోయింది. మౌనం దాల్చింది. మునుపటిలా వైసీపీ ఇతరపార్టీలపై విరుచుకుపడడం లేదు. కారణం ఏంటో తెలియదు కానీ సాధినేనిలో ఇంత భారీ మార్పు అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఆమె నోటి దురుసు వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చిందా? లేక రాజకీయంగా ఆమెను ఎవరైనా టార్గెట్ చేశారో ఏమో కానీ టీడీపీని వీడాక యామిని వార్తల్లో లేకుండాపోయారు. ఆమె విమర్శల గొంతు వినక చాలా కాలమైంది.

తాజాగా సాధినేని యామిని బయటకు వచ్చింది. మళ్లీ పాత యామిని చెలరేగిపోయిందా అనుకునే వారికి షాకిచ్చింది. ఈసారి ఆమె బలమైన వాయిస్ వినపడలేదు. నోటి నుంచి ఒక్క మాట రాలేదు. కేవలం ఒక ప్లకార్టు పట్టుకొని ఏపీ ప్రభుత్వం అమ్ముతున్న భూములపై నిరసన దీక్ష చేస్తానంటూ చూపించింది. ఇలా ఫైర్ బ్రాండ్.. మాటల తూటాలు పేల్చే యామిని ఏం మాట్లాడకుండా.. కేవలం ఒక ప్లకార్డు పట్టుకొని సాదాసీదాగా నిరసన తెలుపడం చూశాక.. యామినికి రాజకీయం ఏదో ఎదురుదెబ్బ తగిలిందని.. అందుకే ఆమె మాట కూడా మాట్లాడడం లేదన్న వాదన తెరపైకి వచ్చింది. ఇంతకీ యామిని ఏం జరిగినట్టు?