Begin typing your search above and press return to search.

వారిద్దరి మీద ప్రాచీ ఏమన్నారంటే..?

By:  Tupaki Desk   |   30 Sept 2015 4:32 PM IST
వారిద్దరి మీద ప్రాచీ ఏమన్నారంటే..?
X
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యల్ని అలవోకగా చేసే బీజేపీ మహిళా నేత సాధ్వీ ప్రాచీ తాజాగా వీరిద్దరిపై మండిపడ్డారు.

ఇటీవల యాంకర్ అమృతాసింగ్ పెళ్లి చేసుకున్న దిగ్విజయ్ సింగ్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ఈ వయసులో పెళ్లి చేసుకున్న ఆయన.. కొడుకుతో ఆడుకుంటారా? మనవళ్లతో ఆడుకుంటారా? అని ఎద్దేవా చేసిన ఆయన.. రాహుల్ ను వదల్లేదు. రాహుల్ రాజకీయాలకు పనికి రాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె.. బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి పంపకుండా అమెరికాకు పంపారన్నారు.

గోరక్ పూర్ లో సాధ్వీ ప్రాచీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మరి.. ఆమె వ్యాఖ్యలపై డిగ్గీరాజా.. రాహుల్ గాంధీలు ఎలా స్పందిస్తారో? అయినా.. రాజకీయాల గురించి మాట్లాడకుండా వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం ఏమిటో..?