Begin typing your search above and press return to search.
పార్లమెంటులో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారా?
By: Tupaki Desk | 7 Aug 2015 6:46 AM GMTతనదైన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాచి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. కోర్టులు దోషిగా ప్రకటించిన వారిని వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఎంపీలు కూడా ఉగ్రవాదులేనని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు సందర్భంగా ఒకరిద్దరు ఎంపీలు.. సుప్రీం తీర్పును తప్పుపట్టటం.. ఈ సందర్భంగా మతాన్ని తెరపైకి తీసుకొచ్చి గందరగోళాన్ని సృష్టించటం తెలిసిందే.
ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. తాజాగా ప్రాచీ.. ఉగ్రవాద వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆమె వ్యాఖ్యలపట్ల విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎంపీలను ఉగ్రవాదులతో పోల్చిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ ను డిమాండ్ చేస్తున్నాయి. మరి.. తాజాగా ప్రాచీ చేసిన వ్యాఖ్యలు మోడీ సర్కారుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.