Begin typing your search above and press return to search.

బీజేపీ వేస్ట్.. మాదే అందగత్తెల పార్టీ

By:  Tupaki Desk   |   28 Jan 2019 5:01 AM GMT
బీజేపీ వేస్ట్.. మాదే అందగత్తెల పార్టీ
X
రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా వారి సామర్థ్యాన్ని బట్టి అందరూ అంచనావేస్తుంటారు. కానీ జాతీయ రాజకీయాల్లో మాత్రం నేతల బలాన్ని కాకుండా అందాన్ని బట్టి వ్యాఖ్యాలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ దేశరాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతల తీరు విమర్శలపాలవుతోంది. ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకొని బీజేపీ నేతలు ఆమె అందంపై విమర్శలు చేయడం దుమారం రేపుతోంది. కాగా బీజేపీ నేతలే కాదు.. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రియాంక అందంపై తాజాగా వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.

తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత - మంత్రి సజ్జన్ సింగ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీలో ప్రియాంక లాంటి అందెగత్తెలు లేరని.. అది వారి దురదృష్టం’ అని వ్యాఖ్యానించడం దుమారం రేపింది. బీజేపీకి ఉన్నది కేవలం హేమమాలిని మాత్రమేనని.. ఆమె చేసే సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించి బీజేపీ వాళ్లు ఓట్లడుక్కోవాల్సిందేనని సజ్జన్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకను అందంగా సృష్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ప్రజల పట్ల ఆమెకున్న గౌరవం - ప్రేమను ఆమె సౌందర్యం ప్రతిబింబిస్తుంది..బీజేపీ నేతలు ఆమె అందంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తమ స్థాయిని దిగజార్చుకోవద్దు అని సజ్జన్ సింగ్ పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.

ప్రియాంక అందం కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో పార్టీలు ఇలా పొట్లాడుకోవడంపై అందరూ ముక్కన వేలేసుకుంటున్నారు. ఇక ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రియాంకపై సెటైర్ వేశారు. ప్రియాంక ‘బైపోలార్ డిజార్డర్’ అనే రుగ్మతతో బాధపడుతున్నారని.. ఇది ఆమె హింసాత్మక స్వభావాన్ని తెలియజేస్తోందంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. ఇలా బీజేపీ నేతలు - కాంగ్రెస్ సొంత పార్టీ నేతల కేంద్రంగా ప్రియాంక గాంధీ అందంపై విమర్శలు - ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.