Begin typing your search above and press return to search.
మోడీ బ్యాచ్ కు ఇంత ఘాటు వార్నింగ్ ఎవరూ ఇవ్వలేదేమో?
By: Tupaki Desk | 24 Dec 2019 12:29 PM GMTతన మనసులోని మాటల్ని మొహమాటం లేకుండా చెప్పేసే అతి కొద్ది మంది రాజకీయ మేధావుల్లో ఒకరు సుబ్రమణ్య స్వామి. తిరుగులేని ప్రజాదరణ ఉన్ననేతగా ఉన్న మోడీని ఉద్దేశించి విమర్శించే దమ్ము.. ధైర్యం బీజేపీలో స్వామికి మాత్రమే చెల్లు. అంతేనా.. మోడీ పాలనలోని తప్పుల్ని ఎలాంటి జంకూబొంకూ లేకుండా ఆయన ఎండగట్టేస్తారు. ఇలా తప్పులు చేస్తారేంటని ప్రశ్నించి ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు కూడా.
అలాంటి స్వామి తాజాగా బీజేపీ అధినాయకత్వానికి ఊహించిన రీతిలో ఘాటు వార్నింగ్ ఇచ్చేశారు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే మోడీ బ్యాచ్.. దేశ ఆర్థిక పరిస్థితి ఎందుకింత దయనీయంగా ఉందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతారు. గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా.. మాటల కోసం తడుముకున్నట్లుగా వ్యవహరిస్తారు.
సరిగ్గా ఇదే అంశాన్ని అందిపుచ్చుకునన్న స్వామి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉందని.. వ్యవస్థను చక్కదిద్దేందుకు సరైన చర్యలు తీసుకోకుంటే బీజేపీ ముక్త భారత్ వాస్తవం అయ్యే అవకాశాలు ఉన్నాయని తేల్చేశారు. ప్రధాని మోడీకి సలహాలు ఇచ్చే వారిపై విరుచుకుపడ్డారు.
మోడీకి సలహాలు ఇచ్చే సలహాదారులు ప్రధానిని చీకట్లో ఉంచుతున్నారన్న స్వామి.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఏదో ఒకటి చేయాలన్నారు. ప్రధాని మోడీకి సలహాలు ఇచ్చే వారెవరో తనకు తెలీదని.. అయితే.. వారు మాత్రం మోడీకి నిజాల్ని చెప్పటం లేదన్నారు. ఇంతకాలం మౌనంగా ఉన్న సుబ్రమణ్య స్వామి ఇప్పుడే ఎందుకు గళం విప్పారు? అన్న సందేహానికి సమాధానం జార్ఖండ్ ఎన్నికల ఫలితాలేనని చెప్పాలి. బాగా కాలినప్పుడే కదా ఎంతటి బలమైన ఇనుము అయినా వంగేది?