Begin typing your search above and press return to search.
తానెందుకు ఓడానో చెప్పిన సాయికుమార్
By: Tupaki Desk | 4 Sep 2018 8:23 AM GMTఈ మధ్యనే ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్‌తో సహా.. పలు భాషల్లో నటించిన నటుడు సాయి కుమార్ ఓడిపోయిన వైనం తెలిసిందే. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటూ.. ఆయన చెప్పిన డైలాగ్ కు థియేటర్లు చప్పట్లతో మారుమోగాయి. వెండి తెర మీద వివిధ పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించిన సాయి కుమార్.. రియల్ లైఫ్ లో మాత్రం తాను పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల మనసుల్ని మాత్రం దోచుకోలేకపోయారు.
దీంతో.. సాయి కుమార్ ఓటమి తప్పలేదు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన.. ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణాల్ని తాజాగా వివరించారు. విజయవాడలో జరుగుతున్న పెళ్లి కోసం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన గొంతే తనను ఈస్థాయికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. తన స్వరం తన తండ్రి నుంచి వచ్చిందని.. తండ్రి స్ఫూర్తితోనే తానీ స్థాయికి ఎదిగినట్లుగా వెల్లడించారు.
తానిప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నట్లు చెప్పిన సాయి కుమార్.. తన కుమారుడు ఆది మూడు సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. తనకు దేశ భక్తి ఎక్కువన్న ఆయన బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మిన వాడిగా విభజన తర్వాత బెజవాడ బాగా అభివృద్ధి చెందిందన్నారు.
తాను ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం.. ప్రజలు తనను నమ్మకపోవటమేనని చెప్పారు. రాజకీయాల్లో తనకు ఎవరూ శత్రువులు లేరని.. తనకు ప్రత్యర్థులు మాత్రమే ఉన్నట్లు చెప్పిన ఆయన.. ఆ విషయాన్ని తనకు వెంకయ్య చెప్పారన్నారు. అదే బాటలోనే తాను సాగుతున్నట్లు చెప్పారు.