Begin typing your search above and press return to search.
పవన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం:సాయి కుమార్
By: Tupaki Desk | 4 May 2018 9:51 AM GMTత్వరలో జరగబోతోన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రముఖ నటుడు సాయికుమార్ బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. తన తల్లి జన్మించిన బాగేపల్లిలో గెలుపు కోసం సాయి కుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఓ సారి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగి ఓటమిపాలైన సాయి కుమార్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను సాయి కుమార్ ఖండించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటోన్న సాయి కుమార్....తాజాగా, జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ తరఫున పవన్ ప్రచారానికి వస్తే ....ఆయనను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని సాయి కుమార్ ప్రకటించారు.
పవన్ ప్రచారానికి వస్తే మాటల యుద్ధానికి తాను సిద్ధమని సాయి కుమార్ మీడియాతో అన్నారు. అంతేకాకుండా, సినీ నటులపై సాయి కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీతారలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నంత మాత్రాన...ఆ అభ్యర్థులు గెలుపొందరని అన్నారు. సినీ నటులతో సెల్ఫీలు దిగేవారంతా ఆయా పార్టీలకు ఓట్లు వేస్తారని గ్యారంటీ లేదని అన్నారు. ప్రచారాల్లో పాల్గొనే సినీ ప్రముఖులతో సెల్ఫీలు దిగేందుకే ప్రజలకు ఆసక్తి కనబరచడం సహజమన్నారు. సినీ తారలతో రోడ్ షో లు చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. ఈ ఎన్నికల్లో తన విజయం ఖాయమని సాయికుమార్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రజల్లోకి నేరుగా వెళ్లగలిగిన అతిపెద్ద మీడియా ‘సినిమా’ అని సాయికుమార్ చెప్పారు. అయితే, స్వతహాగా సినీ నటుడైన సాయి కుమార్....సినీ నటుల వల్ల ఓట్లు పడవని వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.