Begin typing your search above and press return to search.
పవనో లెక్కా అంటున్న మాజీ ఎంపీ
By: Tupaki Desk | 28 Oct 2016 6:12 AM GMTజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీ కేంద్రమంత్రి.. టీడీపీ నేత, కాపు సామాజికవర్గానికి చెందిన సాయిప్రతాప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ అన్న చిరంజీవే ఏమీ సాధించలేకపోయాడు.. పవన్ వల్ల ఏమవుతుందన్నట్లుగా తేలిగ్గా తీసిపడేశారు. ‘‘చిరుపార్టీ ఏమైందో చూశారు కదా’’ అన్న ఆయన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయి. పవన్ కల్యాణ్ ది ఉడుకు రక్తమని రాజకీయాల్లో ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉందని సాయిప్రతాప్ అన్నారు.
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని ఒక గ్రామ సమీపంలోజరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి కొందరు పవన్ అభిమానులు వచ్చారు.. వారంతా పవన్ గురించి మాట్లాడాలని నినాదాలు చేయడంతో సాయి ప్రతాప్ ఇలా షాకిచ్చారు. సమైక్య రాష్ట్రంలో చిరంజీవి పార్టీ పెడితే ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా అని వ్యాఖ్యానించారు. పవన్ కూడా ఒక కులానికో, ప్రాంతానికో పరిమితమైతే చిరు పార్టీలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఉడుకు రక్తంతో ఉన్న పవన్ ప్రత్యేక హోదా కావాలంటున్నారని… కానీ ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరమే లేదని సాయిప్రతాప్ చెప్పారు. సాయిప్రతాప్ వ్యాఖ్యలతో పవన్ అభిమానులు సైలెంటయిపోయారట. సాయిప్రతాప్ కాపు నేత కావడం.. టీడీపీ నేతలు పవన్ విషయంలో ఆచితూచి మాట్లాడుతుండడంతో సాయిప్రతాప్ కూడా పవన్ గురించి బ్యాలన్సు గానో , మంచిగానో మాట్లాడుతారని వారు భావించారు. అందుకే... పవన్ గురించి మాట్లాడాలని కోరారు.. కానీ, సాయి ప్రతాప్ మాత్రం తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూ కుండబద్ధలు కొట్టేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/