Begin typing your search above and press return to search.
కేటీఆర్ దోపిడీ మాఫియాలో సభ్యులు ఎవరో చెప్పాడు
By: Tupaki Desk | 7 May 2021 6:30 AM GMTగడిచిన కొంతకాలంగా కామ్ గా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. కేసీఆర్ కుటుంబాన్ని తరచూ టార్గెట్ చేసే ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున భూకబ్జా చేశారని చెప్పిన దేవరయాంజాల్ లోని సీతారామస్వామి ఆలయ భూముల్ని రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భూవివాదాల విషయంలో మిగిలిన వారికి భిన్నంగా రేవంత్ వాదనలు వినిపించటం మామూలే.
తాజా ఎపిసోడ్ లో అదే తీరును ప్రదర్శించారు. మంత్రి కేటీఆర్ పై ఘాటు విమర్శలు.. ఆరోపణలు చేయటమే కాదు.. ఆయనో దోపిడీ మాఫియాను తయారు చేశారని.. అందులోని సభ్యులు అంటూ ఆయన పేర్కొన్న పేర్లు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. రేవంత్ ఏమన్నారు? ఆయన చేసిన వ్యాఖ్యల్లోని కీలకాంశాలు ఏమున్నాయంటే?
- మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ మాఫియాను తయారు చేసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. కేటీఆర్, ఆయన స్నేహితుడు శ్రీధర్, ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, అర్వింద్‌కుమార్, లోకేశ్‌కుమార్ ఒక మాఫియాగా తయారై రూ.వేల కోట్లు దోచుకుంటున్నారు.
- అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరపాలి. మంత్రి కేటీఆర్‌పై, రెరా చైర్మన్ సోమేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలి. మునిసిపల్ శాఖలో జరుగుతున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డితోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు దేవాలయ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. వాటిని నేను ఆధారాలతో సహా నిరూపిస్తున్నా. వారిపై చర్యలు తీసుకోవాలి.
- దేవరయాంజాల్‌లో 160 వరకు అక్రమంగా గోదాములు నిర్మించినట్లుగా ప్రభుత్వానికి ఐఏఎస్ ల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు ఓ పత్రిక కథనం ప్రచురించింది. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు జరిగితే అది మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వైఫల్యం కాదా?
- శంకర్‌పల్లి మండలం జన్వాడలో కేటీఆర్ అక్రమంగా ఫాంహౌస్ నిర్మించిన విషయాన్ని తాను ఎన్‌జీటీలో నిరూపించానని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేటీఆర్ ఏ తప్పూ చేయకపోతే కోర్టుల్లో స్టే ఎందుకు తెచ్చుకుంటారు? 111 జీవోకు విరుద్ధంగా నిర్మించిన ఫాంహౌస్‌ను ఎందుకు తొలగించరు?
- కేటీఆర్ స్నేహితుడు శ్రీధర్ 111 జీవో పరిధిలో వందల ఎకరాల్లో అక్రమంగా ఫాంహౌ్‌సలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవరయాంజాల్‌లో సర్వేనంబర్ 212 నుంచి 218 వరకు ఆలయ భూముల్లో కేసీఆర్ బంధువు గండ్ల శ్రీనివా్‌సరావు 84 ఎకరాల్లో అక్రమంగా లేఔట్ చేసి, ప్లాట్లను విక్రయిస్తున్నారు.
- నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రింటింగ్ ప్రెస్ కూడా దేవాలయ భూముల్లోనే ఉంది. ఈ స్థలాన్ని ఈటల బినామీగా చెబుతున్న పిసిరి సుధాకర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు సేల్ డీడ్ చేశారు.