Begin typing your search above and press return to search.
బడ్జెట్ ను రామోజీ కోడలు ఎంతగా పొగిడారంటే
By: Tupaki Desk | 7 March 2016 4:29 AM GMTఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్రబడ్జెట్ పై ఈనాడు రామోజీరావు కోడలు శైలజా కిరణ్ పెద్ద ఎత్తున పొగిడేశారు. బడ్జెట్ ను పొగిడేయటం వార్త ఎలా అవుతుంది? అన్న డౌట్ చాలామందికి రావొచ్చు. కానీ.. ఇక్కడే ఓ పాయింట్ ఉండదు. బడ్జెట్ పై అందరి స్పందన వేరు.. రామోజీ ఫ్యామిలీ రియాక్షన్ వేరు. ఎందుకంటే.. ప్రభుత్వానికి అసలుసిసలు ప్రతిపక్షం మీడియానే అని వాదించి.. కొన్ని దశాబ్దాలుగా తన వాదనను వినిపిస్తూ.. ప్రభుత్వం చేసే పనుల్ని ప్రశ్నిస్తామని.. వారి తప్పుల్ని ధైర్యంగా ఎత్తి చూపుతామని చెప్పే ఆయన సొంత కోడలు బడ్జెట్ గురించి కామెంట్ చేసినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆమె చెప్పే మాటలు వినాల్సిన అవసరం ఉంది కదా.
రామోజీ ఇంటి వారు బయట పెద్దగా నోరు విప్పేందుకు ఇష్టపడరు. ఒకవేళ.. మాట్లాడాల్సి వస్తే.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే.. వారు మాట్లాడే అంశాలు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళతాయో అన్న విషయంపై పూర్తిస్థాయి అవగాహన ఉండటం.. అనవసరంగా వివాదాల్లో తల దూర్చటం రామోజీ రావుకు మొదట్నించి అస్సలు ఇష్టం ఉండదు. ఈ కారణంతోనే రామోజీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ పెద్దగా మాట్లాడరు.
కొద్దిగో గొప్పో మాట్లాడేది ఏమైనా ఉందంటే అది శైలజా కిరణ్ మాత్రమే. తాజాగా ఆమె చెన్నైలోని వేల్ టెక్ ఇంజినీరాంగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
గ్రామీణ.. వ్యవసాయ.. సామాజిక రంగాలపై ఆర్థికమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనపర్చటంపై బాగుందని.. దీని ద్వారా దేశానికి ఎంతో మేలు జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలోని 60 శాతమంది జనాభా పల్లెల్లోనే ఉందని.. వారికి మంచి జరిగేలా తాజా బడ్జెట్ ఉందని చెప్పుకొచ్చారు. ఇన్ని మంచి గురించి ప్రస్తావించిన రామోజీ కోడలు.. కోట్లాది మంది ఉద్యోగుల కడుపు కొట్టే భవిష్య నిధి గురించి ఎందుకు ప్రస్తావించలేదు. మంచి గురించి చెప్పినప్పుడు చెడును ప్రస్తావించాల్సిందే. అసలు రామోజీ రావు లెక్కలో అయితే.. ప్రభుత్వాలు ప్రజలకు చేసే మంచిని గురించి కీర్తించాల్సి అవసరమే లేదు. ఎందుకంటే.. ప్రజలకు మంచి చేయటానికే ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి.
కానీ.. ప్రజలకు హాని చేసే అంశాల మీద విపక్ష పాత్ర పోషించాల్సిన పత్రిక బాధ్యతగా చెప్పుకొనే.. తెలుగువాడి గుండె చప్పుడు లాంటి ఈనాడు ఎండీ సతీమణి మాటల్లో అలాంటి భావన మిస్ కావటం దేనికి నిదర్శనం. బడ్జెట్ ను పొగడొద్దని చెప్పటం లేదు. కానీ.. కీర్తించే విషయంలో ఎలాంటి మొహమాటం పడలేదో.. తప్పు పట్టే విషయాన్న అంతే ధైర్యంగా ప్రస్తావించాలన్నదే కోరుకునేది. ఈ దేశంలో ప్రభావం చూపించే వారంతా.. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే స్థాయి ఉన్న వారంతా ప్రభుత్వాలపై కేవలం పొగిడేయటం మాత్రమే కాదు.. వారి తప్పుల్ని ఎత్తి చూపించటం ద్వారా.. వారికి మేలుకొలుపులా ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. అది సాధ్యం కాదనుకుంటే.. పొగడకుండా కామ్ గా ఉంటే సరిపోతుంది. అప్పుడే సమస్యా ఉండదు కదా..?