Begin typing your search above and press return to search.
కొత్త డిమాండ్ విన్నారా?బాబు రాజీనామా చేయాలి
By: Tupaki Desk | 30 April 2016 1:49 PM GMTకేంద్ర హోం మంత్రి హరీభాయ్ చౌదరీ రాజ్యసలో ఏపీకి ప్రత్యేక హోదా లేదంటూ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ బాబు తీరును ఇప్పటికే తప్పుపట్టగా..ఇపుడు కాంగ్రెస్ పార్టీ ఆ వరుసలో చేరింది. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ పీసీసీ ఉపాధ్యక్షులు ఎస్.శైలజానాథ్ - తులసీరెడ్డి హైదరాబాద్ లో నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనవసరమని కేంద్రమంత్రి ప్రకటించినా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు.
ఓటుకు కోటు కేసు చంద్రబాబును భయపెడుతోందా అని వారు సందేహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కుమారుడు లోకేష్ ను సీఎం చేసేందుకు ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ... ప్రతిపక్షాలనే లేకుండా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పెట్టిన ప్రైవేట్ నెంబర్ బిల్లును టీడీపీ వ్యతిరేకించిందని తులసిరెడ్డి - శైలజనాథ్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి - డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలంటూ ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబుకు వారు సూచించారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారో... తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారో లేదా సీఎంగా దిగిపోతారో చంద్రబాబే తేల్చుకోవాలని శైలజానాథ్ - తులసీరెడ్డి తెలిపారు.