Begin typing your search above and press return to search.

వెంక‌య్య చెప్పిన పురిటి నొప్పుల సామెత‌

By:  Tupaki Desk   |   25 Dec 2016 6:41 AM GMT
వెంక‌య్య చెప్పిన పురిటి నొప్పుల సామెత‌
X
మాటల మాంత్రికుడిగా పేరొందిన కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు సంద‌ర్భోచితంగా విసిరే చెణుకుల‌పై ఏపీ మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఘాటు సెటైర్ వేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రజా వ్య‌తిరేక‌మ‌ని శైల‌జ‌నాథ్ మండిప‌డ్డారు. దేశం కోసం అని ఈ నిర్ణ‌యం తీసుకుని 46 రోజులు గడిచిపోయినా రాష్ట్రం లో కష్టాలు తీరక‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం ప్రసవ సమయంలో పురిటి నొప్పులంటూ ఛలోక్తులు విసరడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్త‌వ ప‌రిస్థితుల భ‌యంక‌రంగా ఉంటే కేంద్ర మంత్రిగా ఉన్న వెంక‌య్య‌కు సెటైర్లు వేయ‌డానికి ఎలా మ‌న‌సు వ‌చ్చింద‌ని శైల‌జానాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్రధాని మోడీ నిర్ణయం దేశంలోని 99 శాతం మంది ప్రజలను కష్టాల పాలు చేసిందని శైల‌జానాథ్ మండిప‌డ్డారు. తాజాగా కేంద్రం జ‌పిస్తున్న డిజిట‌ల్ లావాదేవీల వెనుక మ‌ర్మం వేరే ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు దోచి పెట్టడం కోసమే క్యాష్‌ లెస్‌ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారని విమర్శించారు. త‌మ నాయ‌కుడు రాహుల్‌ గాంధీ వాస్తవాలతో సహా ముడుపుల వ్యవహారాన్ని బయటపెడితే - ప్ర‌ధాన‌మంత్రి దానికి సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. పైగా త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేసే ప్ర‌య‌త్నం సాగిస్తున్నార‌ని శైల‌జానాథ్ అస‌హనం వ్య‌క్తం చేశారు.

ఇదిలాఉండ‌గా కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు సైతం ప్ర‌ధానిపై మండిప‌డ్డారు. పేదల డబ్బులపైన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ప్ర‌జ‌ల వద్ద వంద రూపాయ‌ల‌కే ఇబ్బందులు ఎదుర‌వుతుంటే... బీజేపీ నేతలు వందల కోట్లు పెట్టి పెళ్లిల్లు ఎలా చేస్తున్నారని వీహెచ్ ప్ర‌శ్నించారు. కొత్త నోట్లు బడాబాబుల వద్దకు ఎలా చేరుతున్నాయని ప్రశ్నించారు. దీనికి మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దుపై చంద్రబాబు తీసుకున్న యూ టర్న్‌ వాయిస్‌ ను మోడీ దగ్గర వినిపించాలని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ హఠావో .. దేశ్‌ కో బచావో అన్న మమతా బెనర్జీ నినాదాన్ని కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ పోసుకునే సమయంలో కార్డు స్వైపు చేయడం నిషేదామని పెట్రోలియం శాఖ సూచించడం దుర్మార్గమని మండిప‌డ్డారు. పెట్రోల్‌ పొసే సమయంలో ఫోన్‌ వాడకం... కార్డు స్వైపు అత్యంత ప్రమాదమని చెప్పడం సరైందికాదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/