Begin typing your search above and press return to search.
పీసీసీ చీఫ్ గా సాకే..అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
By: Tupaki Desk | 29 Jan 2020 2:00 PM GMTగ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించి ఏపీ శాఖ(పీసీపీ)కి కొత్త అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన పార్టీ సీనియర్ నేత - మాజీ మంత్రి సాకే శైలజానాథ్ బుధవారం ప్రమాణం చేశారు. సాకేతో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులైన పార్టీ నేతలు తులసిరెడ్డి - మస్తాన్ వలీలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ - టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు - మునియప్ప - కర్ణాటక పార్టీ సీనియర్ నేత దినేశ్ గుండూరావు - ఎంపీ కేవీపీ రామచంద్రారావు తదితరులు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ గా సాకే బాధ్యతలు చేపట్టిన ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు కూడా భారీగానే తరలివచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలు, పార్టీ భవిష్యత్తుకు సంబంధించి సాకే ఆసక్తికర ప్రసంగం చేశారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా తాము పనిచేయనున్నామని పేర్కొన్న సాకే... పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. పార్టీలో కొత్త రక్తాన్ని నింపుతామని, పార్టీని వీడిన సీనియర్లు కూడా తిరిగి పార్టీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ పార్టీలో, ఏ హోదాలో ఉన్నా కూడా రాజకీయ జీవితం ప్రసాదించిన పార్టీ పురోభివృద్దికి పాటుపడాలన్న లక్ష్యంతో పార్టీ వీడిన వారంతా తిరిగి రావాలని కోరారు. పాతతరం నేతలు, యువశక్తి మేళవింపుతో పార్టీకి కొత్త రక్తాన్ని నింపుతామని కూడా సాకే చెప్పారు.
ఇక ఆయా పార్టీలతో పొత్తులు, పోరాటాలను ప్రస్తావించిన సాకే... రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సమదూరంగానే మెలగుతామని సాకే చెప్పారు. అధికారంలో ఉన్న వైసీపీతో ఎలా వ్యవహరిస్తామో, విపక్షంలోని టీడీపీతో కూడా అదే రీతిన సాగుతామని చెప్పారు. ఇక బీజేపీ, జనసేనలతోనూ అదే వైఖరితో సాగుతామని కూడా సాకే చెప్పారు. మొత్తంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవన్న సంకేతాలను ఇచ్చిన సాకే... సొంతంగానే పార్టీని పురోభివృద్ధిలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను దూకుడు నిర్ణయాలుగానే అభివర్ణించిన సాకే... మూడు రాజదానులు - శాసనమండలి రద్దులపై అంతర్గతంగా చర్చించుకున్న మీదటే పార్టీ వైఖరిని చెబుతామని పేర్కొన్నారు. మొత్తంగా చాన్నాళ్లుగా రథసారధి లేని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సాకే కొత్తగా పగ్గాలు చేపట్టడంతో పార్టీలో ఓ మోస్తరు జోష్ కనిపించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.