Begin typing your search above and press return to search.
సైనా వర్సెస్ సింధు.. విజేత ఎవరంటే?
By: Tupaki Desk | 15 April 2018 5:30 AM GMTఅంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం కోసం పోటీ పడే ఇద్దరు ఒకే దేశానికి చెందినోళ్లే అయితే.. ఆ మజానే వేరుగా ఉంటుంది. అలాంటి పోటీ భారతీయ క్రీడాకారుల మధ్య నిలిస్తే ఆ పోటీ తీరే వేరుగా ఉంటుంది. తాజాగా అలాంటిదే నెలకొంది. 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్ లో సీనియర్ షెట్లర్ సైనా నెహ్వాల్.. ఒలంపిక్ పతకధారి పీవీ సింధు పోటీ పడ్డారు.
భారతీయులతో పాటు.. పలు దేశాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మ్యాచ్ ఫలితం వచ్చేసింది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ విజేతగా.. స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. అదేసమయంలో ఫైనల్స్ లో ఓడిన సిందుకు రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
అద్భుతమైన పోరాట పటిమతో ఆడిన సైనా.. ఆట ప్రారంభం నుంచే సింధు మీద పైచేయి సాధించేలా ఆడింది. ప్రారంభం నుంచే దూకుడుగా వ్యవహరించిన సైనా.. సింధుపై ఒత్తిడిని పెంచే విషయంలో సక్సెస్ అయ్యింది. వరుస సెట్లలో సింధును ఓడించిన సైనా.. మొదటి సెట్ ను అలవోకగా విజయం సాధించగా.. కీలకమైన రెండో సెట్ మాత్రం పోటాపోటీగా నిలిచింది. రెండో గేమ్ లో సింధు పుంజుకునే ప్రయత్నం చేసినా.. సైనా చెలరేగిపోయేలా ఆడటంతో సింధు తలవంచక తప్పలేదు.
వరుసగా రెండు గేమ్స్ లో విజయం సాధించిన సైనా స్వర్ణాన్ని సొంతం చేసుకోగా.. ఫైనల్స్ లో ఓడిన సింధు రజతాన్ని సాధించింది. వీరిద్దరి మధ్య మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. భారత కాలమానం ప్రకారం.. ఈ రోజు (ఆదివారం) తెల్లవారు జామున ఈ మ్యాచ్ జరిగింది.