Begin typing your search above and press return to search.
సైనాకు స్వర్ణం చేజారి.. రజతం దక్కింది
By: Tupaki Desk | 16 Aug 2015 10:03 AM GMTకాస్త బాధ.. కాస్త ఆనందం అన్నట్లుగా మారింది వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంఫియన్ షిప్ ఫైనల్స్ పోరు. వరల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టిస్తుందని భావించిన హైదరాబాదీ షెట్లర్ సైనా నెహ్వాల్ పోరాడి ఓడింది.
ఇండోనేషియా జకార్తాలో సాగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోరులో స్పెయిన్ క్రీడాకారిణి మారిన్ చేతిలో సైనా నెహ్వాల్ ఓటమి పాలయ్యారు. అయితే.. ఫైనల్ పోరులో స్వర్ణం చేజారినా.. రజతంతో సంతృప్తి చెందే పరిస్థితి. వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో రజతం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించారు. ఫైనల్ మ్యాచ్ లో పోటాపోటీగా సాగింది. అయితే.. కీలకమైన సమయాల్లో సైనా చేసిన తప్పులు ఆమెకు శాపంగా మారాయి.
మొదటి సెట్ లో తరచూ తప్పులు చేసిన సైనా.. రెండో సెట్ లో మాత్రం విపరీతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. అయితే.. తొలి సెట్ ను సొంతం చేసుకున్న ఆత్మవిశ్వాసంలో ఉన్న ప్రత్యర్థి మరింతగా చెలరేగిపోవటం సైనాకు ఓటమి ఖరారైంది. పోటీ మొదటి నుంచి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లుగా సైనా కనిపిస్తే.. టైటిల్ విజేత మారిన్ మాత్రం కూల్ గా కనిపించింది.