Begin typing your search above and press return to search.
వారిద్దరి లవ్ మ్యాచ్ పెళ్లికి ఓకే అయ్యింది!
By: Tupaki Desk | 27 Sep 2018 5:28 AM GMTఇద్దరు ప్రముఖ క్రీడాకారులు ప్రేమలో పడటం కామనే. తాజాగా అలాంటి ఉదంతం మరొకటి తెర మీదకు వచ్చింది. పదేళ్లుగా గుట్టుగా ప్రేమించుకుంటూ.. కొద్ది నెలలుగా సంకేతాలు ఇచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్.. పారుపల్లి కశ్యప్ లవ్ జర్నీ పెళ్లికి ఫిక్స్ అయ్యేలా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు క్రీడాకారుల వివాహం డిసెంబరు 16న జరగనున్నట్లుగా చెబుతున్నారు.
పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్లుగా సమాచారం. అధికారికంగా వీరి పెళ్లి ముచ్చటపై ప్రకటన విడుదల కాకున్నా.. వారిద్దరి సన్నిహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే.. వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సుమారు 100 మంది అతిధుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు.
కుటుంబ సభ్యులు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరుగుతుందని.. పెళ్లి కార్యక్రమం నిరాడంబరంగా సాగనుందని.. విందును మాత్రం భారీ ఎత్తున చేపడతారని చెబుతున్నారు. ఈ విందు డిసెంబరు 21న ఉంటుందని తెలుస్తోంది.
అయితే.. ఈ పెళ్లి ముచ్చటపై అటు సైనా వర్గం కానీ.. ఇటు పారుపల్లి కశ్యప్ వర్గం కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. వీరి పెళ్లి విషయంలో మీడియాలో వచ్చిన వార్తల్ని ఇద్దరి కుటుంబాల వారు ఖండించకపోవటం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వీరిద్దరి పెళ్లి వేడుకకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్లుగా సమాచారం. 28 ఏళ్ల సైనా ఇప్పటివరకూ అంతర్జాతీయ స్థాయిలో 20 టైటిళ్లు సాధించింది. ఒలింపిక్స్ లో కాంస్యం.. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రజత పతకాలు గెలుచుకుంది. మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సాధించింది. ఇదిలా ఉంటే.. 32 ఏళ్ల కశ్యప్ ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో అత్యుత్తమంగా ఆరోర్యాంక్ సాధించాడు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన కశ్యప్ కెరీర్ గాయాల కారణంగా అనుకున్నంత జోరుగా సాగలేదు.
ఇద్దరు షెట్లర్స్ పెళ్లి చేసుకోవటం ఇదే కొత్త కాదు. వీరిద్దరి పెళ్లి ముచ్చట క్రీడా వర్గాల్లో ఆసక్తికరచర్చకు తెర తీసింది. ఎందుకంటే.. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న విషయం గడిచిన పదేళ్లుగా తెలిసినా.. దాన్ని బయటకు రాకుండా ఇరువురు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతారు. ఇక.. సైనా.. కశ్యప్ ల మధ్య స్నేహం 20 ఏళ్లుగా ఉందని.. పదేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నట్లు చెబుతారు. ఇదిలా ఉంటే..గడిచిన రెండేళ్లుగా వారిద్దరి మధ్య ఏదో ఉందన్న భావన కలిగేలా ఇద్దరు వ్యవహరించే వారని చెబుతారు. కశ్యప్ తో తాను బయటకువెళ్లిన ఫోటోల్ని సోషల్ మీడియాలో సైనా పోస్ట్ చేసేది. మొత్తానికి ఇద్దరు ప్రేమపక్షులు ఎట్టకేలకు ఒక్కటి కానున్నారన్నమాట.