Begin typing your search above and press return to search.

భ‌ర్తతో షికారు.. ల‌వ‌ర్‌తో ప‌రారు.. సాయిప్రియ రూటే సెప‌రేటు!

By:  Tupaki Desk   |   27 July 2022 9:11 AM GMT
భ‌ర్తతో షికారు.. ల‌వ‌ర్‌తో ప‌రారు.. సాయిప్రియ రూటే సెప‌రేటు!
X
విశాఖ‌ప‌ట్నం ఆర్కే బీచ్‌లో త‌ప్పిపోయింద‌నుకున్న వివాహిత సాయిప్రియ వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరుగుతోంది. భ‌ర్త శ్రీనివాస్‌తో క‌ల‌సి బీచ్‌కు వచ్చి ఏమ‌రుపాటుగా స‌ముద్రంలో గ‌ల్లంతైంద‌ని అంతా అనుకున్నారు. ఈ మేర‌కు అధికారులు కూడా 36 గంట‌లుగా సముద్రంలో సాయిప్రియ కోసం గాలింపు చేప‌ట్టారు.

అయినా ఆమె ఆచూకీ దొర‌క్క‌పోవ‌డంతో సముద్రంలో గ‌ల్లంత‌యింద‌ని ఒక అంచ‌నాకొచ్చేశారు. అయితే ఆమె నెల్లూరులో త‌న ప్రియుడితో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో అమ్మ నా బ‌త్తాయో అని అనుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. భ‌ర్త‌తో క‌లిసి విశాఖ ఆర్కే బీచ్‌కు వ‌చ్చిన సాయిప్రియ త‌న ప్రియుడు ర‌వితో క‌లిసి నెల్లూరు జంప్ అయ్యింద‌ని ఆమె బంధువులు గుర్తించారు.

ప్రియుడితో ప‌రారైన వివాహిత‌ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళ్తే... శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు కూడా అత‌డితో సాయిప్రియ ప‌లుమార్లు టూర్ల‌కు వెళ్లింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ ప‌రువు పోతోంద‌ని కుటుంబ సభ్యుల ఒత్తిడి చేయ‌డంతో శ్రీనివాస్‌ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.

శ్రీనివాస్‌.. సాయి ప్రియ‌ను పెళ్లి చేసుకున్నాక హైద‌రాబాద్ లో కాపురం పెట్టాడు. అత‌డు హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడ‌ని స‌మాచారం. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో త‌మ రెండో వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా శ్రీనివాస్ జూలై 25న హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాడు.

జూలై 25 రోజు సాయంత్రం 5.30 కి భర్తతో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ అప్ప‌టికే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింద‌ని స‌మాచారం. ఇక బీచ్ లో చీక‌టిప‌డ‌టం, భ‌ర్త‌ శ్రీనివాస్ ఏమరుపాటుగా ఉన్న సమయంలో త‌న ప్రియుడు రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి ప‌రారైంది.

ఇది తెలియని శ్రీనివాస్‌ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా తీర గ‌స్తీ బృందాల‌ను, ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను కూడా రంగంలోకి దింపారు.