Begin typing your search above and press return to search.
మైనర్ ని కిడ్నాప్ చేసిన సంగీత దర్శకుడు
By: Tupaki Desk | 7 Aug 2015 3:15 PM GMTపలు చిత్రాలకు సంగీతదర్శకుడిగా వ్యవహరించిన సాయిరాం సాకేత్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఒక మైనర్ బాలికను మాయమాటలు చెప్పి నిర్బంధించిన ఘటనలో.. సదరు బాలికను రక్షించిన పోలీసులు.. ఇందుకు బాధ్యుడైన సాయిరాం సాకేత్ కోసం గాలింపు చేపట్టారు.
తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోనకు చెందిన సుబ్రమణ్యంకు.. సంగీత దర్శకుడు సాకేత్ తో పరిచయం ఉంది. దీంతో.. తన పదిహేడేళ్ల చిన్నకుమార్తెకు పాటలు పాడే అవకాశం ఇవ్వాలని కోరాడు. దీనికి అంగీకరించిన సాకేత్.. వారి తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ అమ్మాయిని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దీంతో.. ఆమ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటంతో.. గాలింపు చేపట్టారు.
ఈ నేపథ్యంలో సదరు బాలిక ఆచూకీ గుర్తించి.. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. తనకు మాయమాటలు చెప్పి.. సాకేత్ తనను అక్రమంగా నిర్బంధించినట్లుగా ఆ బాలిక చెబుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సంగీత దర్శకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు.. తనను అరెస్ట్ చేయకుండా.. ముందస్తు బెయిల్ కోసం సాకేత్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడని చెబుతున్నారు.