Begin typing your search above and press return to search.

ఈ సంచ‌ల‌న కామెంట్‌.. జ‌గ‌న్‌దా? స‌జ్జ‌ల‌దా?

By:  Tupaki Desk   |   22 Jun 2021 3:09 AM GMT
ఈ సంచ‌ల‌న కామెంట్‌.. జ‌గ‌న్‌దా? స‌జ్జ‌ల‌దా?
X
ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు, స‌ర్కారు నిర్ణ‌యాల్లో క్రియాశీల నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి .. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నంగా మారాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రిలోనూ నెల‌కొన్న సందేహాల‌కు ఆయ‌న స‌మాధానం ఇస్తున్నాన‌ని చెబుతూ.. చేసిన కామెంట్‌.. ఇటు వైసీపీలోను, అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ప్ర‌కంప‌న‌గా మారింది. తాజాగా ఏపీ శాస‌న మండ‌లికి గ‌వ‌ర్న‌ర్ కోటాలో న‌లుగురు ఎంపికైన విష‌యం తెలిసిందే. వారితో ప్రొటెం స్పీక‌ర్ ప్ర‌మాణం చేయించి కొన్ని గంట‌లు కూడా గ‌డ‌వ‌లేదు. అయితే.. మండ‌లిపై ఏకంగా ప్ర‌బుత్వ స‌ల‌హాదారు.. ముఖ్య‌మంత్రికి అత్యంత స‌న్నిహితుడు స‌జ్జ‌ల చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రిలోనూ విస్మ‌యానికి కార‌ణ‌మైంది.

``రాష్ట్రంలో శాస‌న మండ‌లి వృధా! అన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట‌ల‌కు మేం క‌ట్టుబ‌డి ఉన్నాం. మండ‌లి ర‌ద్దు చేసి తీరుతాం`` అని తాజాగా స‌జ్జ‌ల బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మండ‌లిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీదే పైచేయి. ఎక్క‌వ మంది స‌భ్యులు టీడీపీ నుంచే ఉన్నారు. కానీ, వైసీపీ ఇప్పుడు పుంజుకుని.. పైచేయి సాధించింది. అటు శాస‌న‌స‌భ‌లోను ఇటు శాస‌న మండ‌లిలోనూ వైసీపీదే పూర్తి మెజారిటీ. ఏం చేసినా.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా తిరుగులేదు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్షాల నుంచి కొన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో మూడు రాజ‌ధానులు, సీఆర్‌డీఏ చ‌ట్టం ర‌ద్దు అంశాల‌పై మండ‌లి వ్య‌తిరేకించింది.

ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్.. ఏకంగా మండ‌లి వ‌ల్ల‌.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని వ్యాఖ్యానించారు. ఏడాదికి ప్ర‌జాధానం 60 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నామ‌ని.. ఇదంతా వృథాయేన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే మండ‌లి ర‌ద్దుకు నిర్ణ‌యించారు. దీనిపై తీర్మ‌నం చేసి కేంద్రానికి పంపారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఇక‌, ఇప్పుడు వైసీపీ మెజారిటీ పెరుగుతున్న నేప‌థ్యంలోను, సీనియ‌ర్ల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలోను మండ‌లి వైసీపీకి రాజ‌కీయంగా చాలా ఉప‌యోగ‌ప‌డుతోంది. కానీ, జ‌గ‌న్ చేసిన తీర్మానం మాత్రం దుమారం రేపుతోంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కూడా మండ‌లి ర‌ద్దు కోరుతూ.. సీఎంకు లేఖ రాశారు. ఈ ప‌రిణామాలను గ‌మ‌నించిన ప్ర‌భుత్వం మ‌ళ్లీ పాత‌పాటే పాడిందా? లేక‌.. స‌జ్జ‌ల సొంత కామెంటా? అనేది తేలాల్సి ఉంది.