Begin typing your search above and press return to search.
ఏపీలో ముందస్తు ముచ్చట.. సలహాదారు హాట్ కామెంట్స్ ఇవే!
By: Tupaki Desk | 16 Dec 2022 2:43 PM GMTఏపీలో ముందస్తు ఎన్నికలు ఉన్నాయా? ఉండవా? ఇదీ.. కొన్నాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న ఆసక్తి కర చర్చ. ప్రధాన ప్రతిపక్షాలుసైతం ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతోనే దూకుడుగా వ్యవహరి స్తున్నాయి. ఇక, దీనిపై అధికార పార్టీ వైసీపీ నేతలు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ముందస్తు ఉందని చెప్పరు.. లేదని ఖరారు చేయరు.అయితే, అదికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు.. చేస్తున్న పనులు చూస్తే మాత్రం ఎన్నికలకు రెడీ అవుతున్నట్టుగా అనుమానించే పరిస్థితి ఉంది.
ఇదిలావుంటే తాజాగా ప్రభుత్వ సలహాదారు.. కీలక నాయకుడు సజ్జల రామకృష్నారెడ్డి ముందస్తు ముచ్చ టపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి రెండున్నర నెలలకు ఓ సారి గడపగడపకు కార్యక్రమంపై సీఎం సమీక్ష ఉంటుందని ఆయన అన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం.. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు.
‘‘సిన్సియర్‌గా పనిచేయక పోతే మీకే బాగుండదు, నష్టపోతారని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలంతా ప్రతి ఇంటికీ తిరగాలని సీఎం జగన్ ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో పర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమెటిగ్‌గా అభ్యర్థులుగా ఉంటారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే అది సర్వేల్లో ప్రతిబింబిస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు గెలిచేలా సీఎం ప్లాన్ వేశారు. మైక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా ఉండాలనే విషయమై సీఎం ఆదేశించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.
ఏ పార్టీకైనా వారి ఎన్నికల స్ట్రాటజీలు వారికి ఉంటాయన్న సజ్జల ఏ సమయంలో వచ్చిన నివేదికను ఫైనల్‌గా తీసుకోవాలనేది సీఎం జగన్ ఇష్టమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని చెప్పారు. దానిపై వైసీపీ ఎప్పుడు కూడా చర్చ చేపట్టలేదన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా తిరిగి గెలవాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షగా సజ్జల వివరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.