Begin typing your search above and press return to search.
సోము మాటల వెనుక బాబు.. సజ్జలకు ఇలా అన్ని భలేగా తెలిసిపోతాయే?
By: Tupaki Desk | 30 Dec 2021 1:30 AM GMTరాజకీయం మారిపోయింది. గతంలో మాదిరి పరిస్థితులు అస్సలు లేని పరిస్థితి. గతంలో ఒక విమర్శ చేసినా.. ఆరోపణ అస్త్రాన్ని సంధించినా దానికో లెక్క ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా రాజకీయం నడుస్తోంది. టార్గెట్ చేసిన వారిని ఏదోలా బద్నాం చేయటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలది ఒకటే దారి అన్నట్లుగా పరిస్థితి ఉంది. తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాటల్ని వింటే ఇదే భావన కలుగక మానదు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసే వ్యాఖ్యల వెనుక ఉండేది టీడీపీ అధినేత చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. సోము మాట్లాడే మాటల వెనుక బాబు ఉంటారని.. మాటలు ఆయనవే కానీ.. స్క్రిప్టు మాత్రం తయారయ్యేది టీడీపీ కార్యాలయంలో అని పేర్కొన్నారు. టీడీపీ.. బీజేపీలకు సొంత ఎజెండా ఉండటం లేదన్న ఆయన.. ఇంత దిగజారుడుతనం ఎందుకో తనకు అర్థం కావట్లేదన్నారు.
రాజధాని అమరావతి స్కాములమయమని బీజేపీ నేతలు గతంలో అన్నారని.. ఇప్పుడు అదే పార్టీ నేతలు తమకు అధికారాన్ని ఇస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారన్నారు. కర్నూలులో హైకోర్టు ఉండాలని చెబుతారని.. విశాఖ వద్దు ఆ రెండు ప్రాంతాలే కావాలని చెప్పొచ్చు కదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయా పార్టీలతో విజయవంతంగా తోలుబొమ్మలాట ఆడిస్తున్నారన్న సజ్జల వ్యాఖ్యలు నిజమే అనుకుంటే.. సోము అండ్ కో మాట్లాడే మాటల స్క్రిప్టులు టీడీపీ కార్యాలయంలో రెఢీ అయితే.. మోడీషాలు ఊరుకుంటారా? చీమ చిటుక్కుంటే డీటీఎస్ రేంజ్ లో విషయాలు తెలుసుకునే సత్తా ఉన్న వారి డేగ చూపుల్ని తప్పించుకోవటం సాధ్యమా? అన్నది ప్రశ్న.
సజ్జల వారు విమర్శించాలి కానీ.. అందులో లాజిక్ కాస్త ఉండేలా చూసుకోవటం చాలా అవసరం. అందుకు భిన్నంగా సాక్షి ఆఫీసులో రాసే స్క్రిప్టుల్ని సజ్జల చదువుతారంటే ఎంత కామెడీగా ఉంటుందో.. సజ్జల వారి మాటలు అందుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.